)
DMart Share Price: దేశీయ స్టాక్ మార్కెట్లో రిటైల్ సెక్టార్‌కు చెందిన ప్రముఖ లార్జ్ క్యాప్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ (Avenue Supermarts Limited) అంటేనే డీమార్ట్ (DMart) అనొచ్చు. ఈ కంపెనీ షేరుపై గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ (UBS) పాజిటివ్ అభిప్రాయాన్ని చేసింది. డీమార్ట్ షేరుకి బై రేటింగ్ ఇచ్చిన యూబీఎస్, రాబోయే రోజుల్లో దాదాపు 40 శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుతం మార్కెట్లో డీమార్ట్ షేరు ధర సుమారు రూ. 4,758 వద్ద ట్రేడవుతుంది. యూబీఎస్ దీని టార్గెట్ ప్రైస్‌ను రూ. 6,600 గా నిర్ణయించింది. అంటే ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో గత ఆరు నెలల కాలంలో షేరు 24 శాతం లాభాన్ని వాటాదారులకు అందించింది.
యూబీఎస్ విశ్లేషకుల ప్రకారం.. డీమార్ట్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. గతంలో పెద్ద నగరాలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు చిన్న పట్టణాలకూ చేరుతోంది. గత మూడు సంవత్సరాల్లోనే కంపెనీ 130 కొత్త స్టోర్లు ప్రారంభించగా, రాబోయే మూడు సంవత్సరాల్లో మరో 230-250 స్టోర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విస్తరణతో భవిష్యత్తులో ఆదాయం మరింత పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేస్తోంది.
డీమార్ట్ షేర్ అవుట్‌లుక్‌ని పరిశీలిస్తే, ప్రస్తుతం ధర రూ. 4,758 వద్ద ఉండగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ. 5,484.85గా, కనిష్ట స్థాయి రూ. 3,340గా ఉంది. గత వారం 3 శాతం లాభం ఇచ్చిన ఈ షేరు, గత నెలలో 2 శాతం నష్టపోయింది. కానీ ఆరు నెలల కాలంలో 24 శాతం లాభం ఇచ్చింది. ఏడాది కాలానికి 11 శాతం నష్టాన్ని, ఐదేళ్లకు 121 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 3.1 లక్షల కోట్లుగా ఉంది.
కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే, డీమార్ట్ అనేది దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ చైన్స్‌ను నిర్వహించే ప్రముఖ రిటైల్ సంస్థ ఇది. ప్రస్తుతం ఇది 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 415 స్టోర్లను నడుపుతోంది. 2002లో స్థాపించిన ఈ కంపెనీ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2025 జూన్ నాటికి సంస్థలో సుమారు 16,959 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
డీమార్ట్ అంటే మార్కెట్లో బలమైన బ్రాండ్ ఇది. స్టోర్ల విస్తరణ, వినియోగదారుల నమ్మకం.. FMCG రంగంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ కంపెనీ షేర్లు ఎప్పుడూ ఫోకస్లో ఉంటాయి. యూబీఎస్ అంచనాల ప్రకారం టార్గెట్ ప్రైస్ చేరుకుంటే, ఇన్వెస్టర్లకు పెద్ద లాభాలు వచ్చే అవకాశముందని చెప్పొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.