Gold Rate: బంగారం ధరలు గత నెల రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 12 వేల రూపాయలు పెరిగింది ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 88 వేల రూపాయల వద్ద ఉంది. అక్కడ నుంచి బంగారం ధర అత్యంత వేగంగా దూసుకెళ్తూ 1 లక్ష రూపాయలు దాటేసింది. అయితే బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్య పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లతో పాటు చైనాపై అదనంగా 240% విధించిన టారిఫ్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం అవడంతో పాటు, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా రిసెషన్ వైపు అడుగులు వేస్తోందని ప్రముఖ ఏజెన్సీలు సైతం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర గత 25 సంవత్సరాల కాల వ్యవధిలో పసిడి ధరలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండింతలు పెరుగుతూ వచ్చాయని గమనించవచ్చు. ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర 2040వ సంవత్సరం నాటికి రూ. 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2000 సంవత్సరంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 4800 ఉండగా 2025 నాటికి 1,00,000 రూపాయలు దాటింది.
2000 – రూ.4,400
2005 – రూ.7,000
2010 – రూ.18,500
2015 – రూ.26,000
2020 – రూ.48,000
2025 – రూ.1,00,000
పైన పేర్కొన్న ప్యాటర్న్ గమనించినట్లయితే 2010-2015 మినహా దాదాపు అన్ని సార్లు బంగారం ధర ప్రతి ఐదు సంవత్సరాల గ్యాపులో డబుల్ అయింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఐదు సంవత్సరాల చొప్పున బంగారం ధరలు రెండు రెట్లు పెరిగినట్లు అయితే 2030 నాటికి బంగారం ధర రూ. 2,00,000, అలాగే 2035 నాటికి రూ. 4,00,000 అలాగే 2040 నాటికి బంగారం ధర రూ. 6 నుంచి 8 లక్షలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
ఇదిలా ఉంటే ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ దీర్ఘకాలిక అంచనా రాబడి (GLTER) అనే సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2025 నుంచి 2040 మధ్య కాలానికి బంగారం మీద సగటు వార్షిక రాబడి (average annual return) 5.2% మేర ఉండే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. అంటే ఈ 15 సంవత్సరాల కాల వ్యవధిలో బంగారంలో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సగటున 5.2% లాభం వచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఈ రాబడి ప్రపంచ స్థాయిలో అంచనా వేసిన GDP వృద్ధి రేటుకి దగ్గరగా ఉందని తెలిపింది. అంటే బంగారం విలువ ప్రపంచ ఆర్థిక వృద్ధి కన్నా అధికారంగా పెరుగుతుందని అర్థం. అలాగే US CPI (Consumer Price Index) ద్రవ్యోల్బణం 2.5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన చూస్తే బంగారం ద్రవ్యోల్బణం నుంచి రక్షణ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









