)
Trump Coming to India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు రావొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా రాయబారి నామినీగా ఉన్న సెర్గియో గోర్ సెనేట్ విదేశాంగ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ట్రంప్ క్వాడ్ నాయకుల సమావేశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారన్నారు. ట్రంప్ 2025 నవంబర్‌లో భారతదేశం పర్యటించే అవకాశం ఉందని సూచించారు. ఈ ఏడాది చివర్లో భారత్ క్వాడ్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటకు ఎప్పుడు వస్తారన్నది ఖచ్చితమైన తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరుకావాలని ట్రంప్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మధ్య కాలంలో ఇండో-అమెరికా సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఈ చర్య ఇరుదేశాల వాణిజ్య సంబంధాల్లో ప్రభావం చూపించినప్పటికీ, సోషల్ మీడియాలో ట్రంప్–మోదీ సానుకూల వైఖరి ప్రదర్శించడం గమనార్హం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, ట్రంప్ భారత్ పర్యటనపై వస్తున్న సంకేతాలు స్టాక్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్‌ను తెచ్చే అవకాశం ఉంది. సోమవారం ట్రేడింగ్ సెషన్ గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఆటో, టెక్స్టైల్ రంగాల షేర్లు లాభాలను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫార్మా రంగంలో అరబిందో ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్ వంటి స్టాక్స్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. డిఫెన్స్‌లో బిఇఎల్, హెచ్ఎఎల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ కీలకంగా ఉంటాయి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్, టెక్ఎం, హెచ్‌సిఎల్ టెక్, విప్రో షేర్లు పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆటో రంగంలో ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టివిఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి షేర్లు హాట్ స్పాట్స్‌గా మారవచ్చు. అదే విధంగా అమర రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, యుఎన్ఓ మిండా వంటి కంపెనీలు కూడా లాభదాయకమయ్యే అవకాశముంది.
ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ... భారత్.. రష్యా నుండి అధికంగా చమురు దిగుమతి చేస్తోంది. అందుకే నేను 50శాతం సుంకం విధించాను. ఇది చిన్న విషయం కాదు. ఇది రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేసే నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ భారత్, చైనాపై అధిక సుంకాలు విధించాలని ట్రంప్ సూచించడం గమనార్హం.
మొత్తానికి, ట్రంప్ పర్యటన సంకేతాలు ఇండో-అమెరికా సంబంధాలకు కొత్త దారులు తీసుకురావడమే కాకుండా, భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.