Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచ దేశాలు ఆగమాగం అవుతున్నాయి. దీటుగా స్పందిస్తున్నాయి. చైనా, కెనడా వంటి దేశాలు మాత్రం ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా స్పందించిన ట్రంప్..కంపెనీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని దిగ్గజ సంస్థలకు పిలుపునిచ్చారు. టారిఫ్స్ సమస్య ఉండదని..వేగంగా అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మీ కార్యకలాపాలను అమెరికాకు తరలించేందుకు ఇది గొప్ప సమయం. యాపిల్ సహా ఇతర అనేక కంపెనీలు ఇప్పటికే షురూ చేశాయి. జీరో టారిఫ్స్, తక్షణమే విద్యుత్, ఇంధను అనుమతులు, పర్యావరణ అనుమతుల్లో ఎలాంటి సమస్య ఉండదు. వేచి చూడకూడదు. వెంటనే మొదలుపెట్టండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలు విధించడం మంచి విషయమని జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈవో జామీ డిమోన్ గతంలో చెప్పిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. అంతా సవ్యంగానే సాగుతోందని అమెరికా గతంలో కంటే గొప్పగా పని చేస్తోందని తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లే అవకాశం ఉందని జామీ డిమోన్ అంచనా వేశారు. మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ మొండి బకాయిల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే డిమోన్ గతంలో టారిఫ్స్ ను సమర్థిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే.
Also Read: Gold Rate: పసిడిప్రియులు ఎగిరి గంతేసే వార్త.. ఏకంగా రూ. 4000లకు పడిపోయిన బంగారం ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









