Trump Tariff Bomb: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొన్ని గంటల్లోనే టారిఫ్స్ పై ప్రకటన చేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 4.00గంటలకు ( భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30గంటలకు ) ఆయన తన మంత్రివర్గ సభ్యులతో కలిసి వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో టారిఫ్ లను ప్రకటించనున్నారు. తన కొత్త వాణిజ్య విధానాలను అమెరికాను దోపిడి నుంచి కాపాడుతాయని..దేశాన్ని స్వర్ణయుగంవైపు నడిపిస్తాయని ట్రంప్ హామీ ఇస్తున్నారు.ట్రంప్ ప్రకటన తర్వాత ఈ కొత్త సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని మంగళవారం వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికన్ కార్మికులు, పరిశ్రమలకు హాని కలిగించే అన్యాయమైన వాణిజ్య విధానాలను ఎదుర్కోవడమే ఈ సుంకాల లక్ష్యమని చెబుతున్నారు.
నేడు ఏప్రిల్ 2న అమెరికా ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఇది అమెరికాలో విమోచన దినోత్సవం అంటూ పోస్టు చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చాలా కాలంగా అమెరికా ప్రపంచానికి పిగ్గీ బ్యాంకుగా ఉంది. ఈ రోజు మనం తిరిగి మన కంట్రోల్లోకి తీసుకుంటున్నాము. ఇది మన విముక్తి దినం. అన్యాయమైన వాణిజ్య ఒప్పందాలు, అమెరికన్ వస్తువులపై భారీ సుంకాలు, మన వ్యాపారాలు , కార్మికులకు హాని కలిగించే విధానాల నుంచి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.
Also Read: Stock Market: ట్రంప్ టారిఫ్ కు భయపడేదేలే..లాభాల్లో స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 450 పాయింట్లు జంప్
ట్రంప్ పరిపాలన ఈ చర్య చైనా, యూరోపియన్ యూనియన్, భారత్,జపాన్, మెక్సికో, కెనడా వంటి ప్రధాన వాణిజ్య భాగస్వాములను ప్రభావితం చేస్తుంది. ఈ సుంకాల ప్రకటన ప్రపంచ మార్కెట్లో ప్రకంపనలు రేపుతుంది. అనేక దేశాలు ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం ఉందని సూచించాయి. ఇది కొత్త ప్రపంచ వాణిజ్య యుద్ధం భయాన్ని పెంచింది.
Also Read: Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









