Tariff War: కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న ట్రంప్..టారీఫ్ దెబ్బతో ఆ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల నష్టం అంటే?

Tariff War: అమెరికా అధ్యక్షుడు ప్రపంచదేశాలపై ఒక్కసారిగా వాణిజ్య యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలు విధించబోతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తన సొంత రాష్ట్రాలు కూడా భారీ నష్టాల్లో కూరుకుపోనున్నాయి. ముఖ్యంగా టెక్సాస్ దీని భారాన్ని భరించాల్సి ఉంటుంది. టెక్సాస్ జీడీపీ రూ. 4లక్షల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.   

Written by - Bhoomi | Last Updated : Apr 1, 2025, 05:36 PM IST
Tariff War: కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న ట్రంప్..టారీఫ్ దెబ్బతో ఆ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల నష్టం అంటే?

Tariff War:  డొనాల్డ్ ట్రంప్  రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతులు చేపట్టినప్పటి నుంచి దూకుడు పెంచారు. ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా పూర్తి స్థాయి సుంకాల యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ ఇతర దేశాలను దాని పరిణామాలు అనుభవించడమే కాకుండా..తాను కూర్చుకొన్న  కొమ్మను కూడా నరుక్కునే పరిస్థితి తెచ్చుకున్నాడు ట్రంప్. అవును ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాల వల్ల అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ ప్రభావం టెక్సాస్ రాష్ట్రంపై ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏడాది 3.70లక్షల ఉద్యోగాలు కోల్పోతారని అంచనా వేయగా..ఆ రాష్ట్ర జీడీపీ కూడా రూ. 4లక్షల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ సుంకాల యుద్ధం కారణంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై అనేక రకాల  నష్టాలు తలెత్తుతాయి. ఆ నష్టాలను కూడా అక్కడి పౌరులే భరించాల్సి ఉంటుంది. 

Add Zee News as a Preferred Source

మనీవైజ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం... ఈ సుంకాల వల్ల టెక్సాస్ ఎక్కువగా ప్రభావితమవుతుందని పేర్కొంది. ఈ సుంకాల కారణంగా, ముఖ్యంగా మెక్సికో.. కెనడాపై విధించిన సుంకాల కారణంగా టెక్సాస్ ప్రతి సంవత్సరం 370,000 ఉద్యోగాలను కోల్పోతుందని అంచనా వేసింది. అంతేకాదు  దాని GDP కూడా $47 బిలియన్ల (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) నష్టాన్ని చవిచూస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Also Read: Reciprocal Tariff: ట్రంప్ టారీఫ్.. అమెరికాతో సహా ఏ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అందులో భారత్ ఉందా?  

ఈ ప్రభావం టెక్సాస్ పైనే ఎందుకు? 

టెక్సాస్ రాష్ట్రం  మెక్సికోకు దగ్గరగా  ఉంటుంది. దీంతో  సుంకాల కారణంగా ఎక్కువ నష్టాలను చవిచూస్తుంది. ఈ రాష్ట్రం దాని పొరుగు దేశంతో బలమైన ఆర్థిక సంబంధాలను కొనసాగించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉన్న మెక్సికో టెక్సాస్ నుండి పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తుంది. 2024లోనే టెక్సాస్ మెక్సికోకు $123.5 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది దాని మొత్తం ఎగుమతుల్లో 27శాతం. ఈ రెండు దేశాల మధ్య సుంకం అనే గీత గీస్తే..దాని ప్రభావం రెండు దేశాలపై కనిపిస్తుంది. అంతేకాదు కెనడా టెక్సాస్ కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఏడాది $36.6 బిలియన్ల విలువైన వాణిజ్యం జరిగింది. మెక్సికో, కెనడాలతోనే కాదు.. టెక్సాస్ నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, చైనాలతో కూడా వ్యాపారం చేస్తుంది.

Also Read:  Trump Tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌లు.. ఈ భారతీయ ఫార్మా కంపెనీలకు చావు దెబ్బ తప్పదా?

ఈ రెండు దేశాలపై సుంకాలు పెంచితే..ప్రతీకార చర్యల ఫలితంగా వస్తువుల ధరలను పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్సాస్ లో ఇళ్లను నిర్మించుకోవాలంటే కెనడా నుంచి పెద్ద మొత్తంలో ఉక్కు, కలపను దిగమతి చేసుకుంటుంది. ఈ ముడిపదార్థాలపై అధిక సుంకాలను విధిస్తే నిర్మాణ ఖర్చులను భారీగా పెరుగుతాయి. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల నష్టంతోపాటు ఉద్యోగాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News