Musk Deletes Explosive Post: లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లలో డోనాల్డ్ ట్రంప్ పేరు ఉందని పేర్కొన్న పోస్ట్‌ను ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X నుండి తొలగించారు. ఇటీవల ట్రంప్, మస్క్ మధ్య బంధానికి బీటలు వారిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. మీరు మళ్లీ కలుస్తారా అనే స్థాయిలో నిందించుకున్నారు. ఇలాంటి తరుణంలోనే ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన బిగ్ బాంబ్ పోస్టును మస్క్ తాజాగా తొలగించడం చర్చకు దారి తీసింది.
ఈమధ్య ఎలాన్ మస్క్ అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్ స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపణలు చేశారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని తీవ్ర విమర్శలు కూడా చేశారు. అంతేకాదు భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఆ పోస్టును మస్క్ తొలగించేశారు. వారిద్దరి మధ్య సంధికి ఇదొక సూచిక అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
ఇదెలా ఉంటే ట్రంప్ తో శాంతి కుదుర్చుకోవాలని అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్అక్ మాన్, ఎలాన్ మస్క్ ను కోరారు. ఈ ఇద్దరికీ మద్దతుగా మాట్లాడిన ఆయన మనం విడిగా ఉండటం కంటే కలిసి ఉంటేనే బలంగాఉంటామంటూ ఓ పోస్టు కూడా పెట్టారు. దానికి ప్రతిగా మీరు చెప్పింది తప్పుకాదంటూ మస్క్ బదులు ఇచ్చారు. మరోవైపు మస్క్ పై ట్రంప్ బహిరంగంగా విమర్శలు చేయకుండా వైట్ హౌస్ ప్రతినిధులు కృషి చేస్తున్నారని ఓ మీడియా కథనాన్ని పేర్కొంది.
ఈ విభేదాలపై అధ్యక్షుడు ట్రంప్ ను మీడియా ప్రశ్నించింది. నేను చాలా బిజీగా ఉన్నాను..చైనా, రష్యా, ఇరాన్ సంబంధిత విషయాలపై పనిచేస్తున్నాను. నాకు ఎన్నో పనులు ఉన్నాయి. ఎలాన్ మస్క్ గురించి నేను ఆలోచించడం లేదు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాను. మేము అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకున్నాం. మస్క్ చాలా సబ్సిడీలు తీసుకున్నారు. పెద్దమొత్తంలో నిధులు అందుకున్నారు. దాన్నిపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా పారదర్శకంగానే జరిగిందా లేదా అనేది చూడాలి. మస్క్ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎవరూ లేకున్నా అమెరికాకు ఏం కాదు..ఒక్క నేను తప్పా అంటూ బదులిచ్చారు.
Also Read: Salt-powered scooters: "ఉప్పు"తో నడిచే స్కూటర్లు వచ్చాయి..పెట్రోల్ నింపే టెన్షన్ పోయినట్లేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









