Starlink Free Offer: గుడ్‌న్యూస్, స్టార్ లింక్ ఇంటర్నెట్ నెల రోజులు ఫ్రీ

Starlink Free Offer: ప్రపంచ కోటీశ్వరుడు, తెస్లా అధినేత ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఉచితంగా అందిస్తున్నాడు. నచ్చితేనే కనెక్షన్ తీసుకోమంటున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2025, 11:39 AM IST
Starlink Free Offer: గుడ్‌న్యూస్, స్టార్ లింక్ ఇంటర్నెట్ నెల రోజులు ఫ్రీ

Starlink Free Offer: ఇంటర్నెట్ అనేది ఇప్పుడు సర్వాంతర్యామిగా మారిపోయింది. చాలా సులభంగా అందరికీ అందుబాటులో వచ్చేసింది. ఇప్పుడు మిగిలిందంతా ఎంత వేగంగా, అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందిస్తున్నామన్నదే. అందుకే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్‌పై అందరి దృష్టి నెలకొంది. ఎలాన్ మస్క్ అందిస్తున్న స్టార్ లింక్ ఇంటర్నెట్ అదే. 

Add Zee News as a Preferred Source

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ఇండియాలో ప్రవేశించింది. ఈ సందర్బంగా భారతదేశ ప్రజలకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ అందిస్తున్నాడు. ఓ నెల ఫ్రీ ట్రయల్ ఆఫర్ ప్రకటించిన ఎలాన్ మస్క్ నచ్చితేనే కనెక్షన్ తీసుకోమంటున్నాడు. స్టార్ లింక్ ద్వారా దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు వచ్చేశాయి. స్టార్ లింక్ సేవలు ప్రారంభించే క్రమంలో ఈ ఉచిత ఆఫర్ ప్రకటించాడు. ముందుగా ఉచితంగా ఓ నెల ట్రయల్ సేవలు వాడి చూడమని చెబుతున్న ఎలాన్ మస్క్ అంతా సక్రమంగా ఉందని అన్పిస్తేనే కొనసాగించమని సవాలు విసురుతున్నాడు. 

స్టార్ లింక్ సేవలు కావాలంటే ముందుగా డిష్ కోసం 33 వేలు చెల్లించాలి. ఆ తరువాత ప్రతి నెలా 3 వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు లభించేశాయి. మరో రెండు నెలల్లో ఇండియాలో స్టార్ లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇకపై అడవులు, కొండలు, లోయలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ విరివిగా లభిస్తుంది. 

Also read: Ahmedabad Plane Crash: ఆలస్యం విషం కాదు అమృతమే. ప్రాణాలు దక్కించుకున్న యువతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News