)
PF Withdraw: దేశంలోని ఎనిమిది కోట్ల మందికిపైగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్లకు శుభవార్త. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్ట్స్ లెవల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0ను 2025లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేజర్ అప్ గ్రేడ్ పీఎఫ్ మెంబర్స్ తమ డబ్బును వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఇది 2025 జూన్ నాటికే రావాల్సి ఉంది. అయినప్పటికీ టెక్నికల్ టెస్టింగ్ కారణంగా ఆలస్యమైంది. ఇన్ఫొసిస్, విప్రో, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలు ఈ సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నాయి. దీంతో ఈ కొత్త ఫ్లాట్ ఫామ్ ఫాస్ట్ అండ్ సేఫ్టీ ఆప్షన్స్ అందిస్తుంది.
ఈపీఎఫ్ఓ తమ సభ్యుల కోసం మరో పెద్ద సంస్కరణ తీసుకొచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ వెర్షన్ ద్వారా ఫీఎఫ్ అకౌంట్ కు సంబంధించిన అనేక సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసులపై ఆధారపడేవారు. కానీ కొత్త అప్డేట్తో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల్లోనే రియల్ టైమ్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ సేవింగ్స్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌లో ఒక్క ట్యాప్‌తోనే కనిపిస్తాయి.
సభ్యులకు మరో పెద్ద సౌకర్యం ఇన్స్టంట్ విత్‌డ్రా ఫెసిలిటీ.ఇది అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.1 లక్ష వరకు వెంటనే విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా యూపీఐ యాప్ లేదా ఏదైనా ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు. ఇక నుంచి పెద్ద ఫారమ్స్ నింపడం, క్లెయిమ్ అప్రూవల్స్ కోసం రోజుల తరబడి వేయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి రిక్వెస్ట్ చేసిన వెంటనే, నిమిషాల్లోనే డబ్బు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
EPFO 3.0 అప్డేట్ పెన్షనర్లకు కూడా మేలు చేస్తోంది. ఇప్పటివరకు పెన్షన్ తీసుకోవడానికి వారి బ్యాంక్ కు వెళ్లేవారు. కానీ ఇకపై దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఊరు మారినప్పటికీ, బ్యాంక్ మారినప్పటికీ పెన్షన్ సులభంగా పొందే ఛాన్స్ ఉంటుంది. విత్‌డ్రా ఆప్షన్లను కూడా విస్తరించారు. పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే రిటైర్మెంట్ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. ఆరోగ్య అత్యవసరాలు, పిల్లల విద్య, పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం కూడా పీఎఫ్ డబ్బులను వినియోగించుకోవచ్చు. దీంతో సభ్యులు తమ అవసరానికి అనుగుణంగా డబ్బును ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతున్నారు.
ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా మరింత వేగవంతం కానుంది. ముందుగా క్లెయిమ్స్ క్లియర్ కావడానికి చాలా కాలం పట్టేది. ఈపీఎఫ్ 3.0 తర్వాత ఎక్కువ క్లెయిమ్స్ కేవలం 3 రోజుల్లోనే ఆటోమేటిక్‌గా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. డెత్ క్లెయిమ్స్ విషయంలో కూడా ప్రాసెస్ సులభతరం అవుతుందని చెప్పవచ్చు. మైనర్ నామినీ ఉన్న సందర్భాల్లో గార్డియన్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఇది కష్ట సమయంలో కుటుంబాలకు పెద్ద రిలీఫ్ అవుతుంది.
మొత్తానికి ఈపీఎఫ్ఓ 3.0 పూర్తిగా మొబైల్ ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా డిజైన్ చేస్తోంది. సభ్యులు ఓటీపీ వెరిఫికేషన్‌తో ఆన్లైన్లోనే తమ వివరాలను మార్చుకోవచ్చు.అంతేకాదు క్లెయిమ్ స్టేటస్‌ను లైవ్‌గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక నుంచి పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అన్ని సర్వీసులు మొబైల్లోనే అందుబాటులో ఉండనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.