EPFO 3.0: ప్రైవేటు ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త: PF డబ్బులు తీసుకోవడం ఇక మరింత సులభం

EPFO 3.0:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని  ఈపీఎఫ్ఓ విషయంలో   పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్వోకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీస్ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అందులో భాగంగా ఇకపై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఉద్యోగులు ఎలాంటి తాత్సారం లేకుండానే విత్డ్రా చేసుకునేలా పలు కీలకమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చారు.  

Written by - Bhoomi | Last Updated : Apr 22, 2025, 05:52 PM IST
EPFO 3.0: ప్రైవేటు  ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త: PF డబ్బులు తీసుకోవడం ఇక మరింత  సులభం

EPFO 3.0: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని  ఈపీఎఫ్ఓ విషయంలో   పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్వోకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీస్ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అందులో భాగంగా ఇకపై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఉద్యోగులు ఎలాంటి తాత్సారం లేకుండానే విత్డ్రా చేసుకునేలా పలు కీలకమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చారు.  

Add Zee News as a Preferred Source

వీటిని ఈపీఎఫ్ఓ 3.0గా  మార్పు చేస్తూ  మోడీ సర్కార్  అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మంసుఖ్ మాండవియా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో  కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు  చేస్తామని కీలక ప్రకటన చేయగా ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులకు కూడా  ఊరట కల్పించేలా ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా విషయంలో  ఉన్న అడ్డంకులు అన్నిటిని తొలగించి  కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. 

EPFO 3.0 కీలక అంశాల విషయానికి వస్తే EPFO 3.0 వర్షన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. 2025 మే లేదా జూన్ లో ఇది ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అత్యంత  కీలకమైన ATMల ద్వారా PF డబ్బు విత్‌డ్రా చేసే సదుపాయం కూడా  త్వరలోనే అందుబాటులోకి రానుంది. EPFO 3.0 ద్వారా ఉద్యోగులు ATMల నుంచే నేరుగా PF డబ్బును  విత్ డ్రా చేసుకోగలరు. 

గతంలో ఉద్యోగులు పదవి విరమణ అనంతరం  పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా  చేసుకోవాలంటే నెలల తరబడి వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.  ఇకపై ఆ అవసరం అవసరం ఉండదు.

Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?  

అలాగే కొత్త నిబంధనల ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది. ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా   ప్రైవేటు ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులు  పదవీ విరమణ అనంతరం  ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడంతో పాటు,  సర్వీసులో ఉన్నప్పుడు కూడా ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అవుతుందో వారికి  ఈపీఎఫ్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు  సులభంగా తీసుకునే అవకాశం లభిస్తుంది. EPFO 3.0 వలన ఉద్యోగులు తమ PF డబ్బును చాలా ఈజీగా, తక్కువ టైమ్‌లో, ATMల నుంచే తీయగలుగుతారు. ఇది లక్షలాది మంది ఉద్యోగులకు బాగా ఉపయోగపడే మార్పుగా  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News