EPS 95 News Updates: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్ దారులకు వేతన సవరణలు చేసేందుకు ఇప్పటికే కీలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 8వ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ అతి త్వరలోనే 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీంతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఊరట కల్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ పే ఆర్డర్లను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందిస్తోంది. హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా ఛాన్స్ ఉంది. ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం వల్ల మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఎలాగో చూద్దాం.
మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫారం అప్లయ్ చేసినట్లయితే అయినప్పటికీ ఇంకా పెన్షన్ పే ఆర్డర్ రానట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫాం ఉన్న తప్పులను సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ శాఖ సంప్రదించాల్సి ఉంటుంది.
గతంలో పనిచేసిన కంపెనీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూటషన్ స్లిప్పులు, శాలరీ స్లిప్పులు
ఉపాధి ధ్రువీకరణ పత్రం
జాయింట్ ఆప్షర్ ఫారం
చెల్లుబాటు అయ్యే ఐడి రుజువు
Also Read: Suzuki Hayabusa: యువతకు పిచ్చెక్కించే బైక్.. కొత్తకొత్తగా అదిరే ఫీచర్లతో హయబుసా..ధర ఎంతో తెలుసా?
ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించనున్నారు. మీరు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాలనుకున్నా అది డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే సమర్పించాలి.
మీరు గతంలో దరఖాస్తు చేసిన ఫారంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది.
మీ పెన్షన్ పే ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి. https://www.epfindia.gov.in/site_en/index.php
మెంబర్ ఈ సేవా ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
హయ్యర్ పెన్షన్ స్టేటస్ సెక్షన్ లోకి వెళ్లి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ దరఖాస్తును ట్రాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: Credit Card: మీ క్రెడిట్ కార్డును Google Payకి ఎలా లింక్ చేయాలి..ఇక్కడ ఇలా తెలుసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









