
EPS 95 Pension: దేశవ్యాప్తంగా వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు సుదీర్ఘకాలంగా మినిమం పెన్షన్ పెంపు కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు వారికి నెలకు కనీసం రూ.1000 మాత్రమే లభిస్తోంది. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం, వైద్య చికిత్సల వ్యయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం చాలా తక్కువేనని పెన్షనర్లు వాపోతున్నారు. అందుకే కనీసం రూ.7500 మినిమం పెన్షన్ ఇవ్వాలని వారు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షనర్ల ఆవేదనను సమీక్షించి, కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో మినిమం పెన్షన్ పెంచడం తప్పనిసరి అని సూచనలూ చేశాయి. ఫలితంగా ఇప్పుడు కేంద్రం ఈ అంశంపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం బయటకొస్తోంది. ముఖ్యంగా రాబోయే పండుగల సమయంలో, ముఖ్యంగా దసరా నాటికి పెన్షనర్లకు శుభవార్త ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక సందిగ్ధం మాత్రం ఉంది. పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నట్టు రూ.7500 పెన్షన్ పెంచుతారా? లేక కేంద్రం భావిస్తున్నట్టు రూ.3000 వరకు మాత్రమే పెంచుతారా? గతంలో ప్రభుత్వం రూ.3000 పెన్షన్ ప్రతిపాదనను పరిశీలించినా, పెన్షనర్ల సంఘాలు దాన్ని తిరస్కరించాయి. వారి వాదన ప్రకారం, ఈ పెంపు జీవన వ్యయాలకు సరిపోదు. కనీసం రూ.7500 ఇవ్వకపోతే పెన్షనర్ల సమస్యలు అలాగే కొనసాగుతాయని వారు చెబుతున్నారు.
ఈపీఎస్ 95 పెన్షన్ మినిమం పెన్షన్ విషయంలో గత కొంతకాలంగా పోరాటం నడుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల వార్త రాలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి మినిమం పెన్షన్ పెంపుదలపై పార్లమెంటరీ కమిటీ బసవరాజు బొమ్మై ఎంపీ సారథ్యంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రధానంగా పెన్షన్ల ఆవేదనను అర్థం చేసుకుని సానుకూలంగా కేంద్రానికి సూచలను చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక మరోవైపు, ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడే అవకాశమున్నందున, కేంద్రం మధ్యస్థ పరిష్కారాన్ని ఎంచుకోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ పెన్షనర్ల కుటుంబాలకు సరిపడా పెన్షన్ అందించడం ప్రభుత్వ బాధ్యత అనే వాదన బలంగా వినిపిస్తోంది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు కళ్లప్పగించి ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉండటంతో, అందరి దృష్టి ఇప్పుడు కేంద్రంపై నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.