)
Konti Infrapower and Multiventures: కోటక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC)ను ఎస్సెల్ గ్రూప్ సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ను ఆశ్రయించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ కొంటి ఇన్ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ ఈ కేసులో పిటిషన్ దాఖలు చేశాయి. ఏప్రిల్ 6, 2019 నాటి ఒప్పందానికి సంబంధించిన డబ్బును కోటక్ AMC చెల్లించలేదని పిటిషన్లో పేర్కొంది. AMC కి అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.12.99 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరింది. SEBI సాధారణ వార్షిక తనిఖీ పూర్తయిన తర్వాత AMC రూ.12.99 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు చెల్లించలేదు.
“కార్పొరేట్ రుణగ్రహీత 6 ఏప్రిల్ 2019 నాటి ఒప్పందం ప్రకారం.. ఇచ్చిన ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనంది. 19 ఫిబ్రవరి 2025 నాటి డిమాండ్ నోటీసు ద్వారా ఇతర అంశాలతో పాటు, కార్పొరేట్ రుణగ్రహీతను మరోసారి తాత్కాలిక చర్యగా బకాయి ఉన్న మొత్తాలను విడుదల చేయాలని కోరాం. కానీ ఇప్పటివరకు AMC నుంచి ఎలాంటి చెల్లింపులు అందలేదు” అని కొంటి ఇన్ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ పిటిషన్లో పేర్కొంది. కోటక్ AMCకి అడ్వాన్స్ చేసిన మొత్తాన్ని SEBI ద్వారా మొదటి తనిఖీ పూర్తయిన తర్వాత కొంటి ఇన్ఫ్రాపవర్కు తిరిగి చెల్లించాల్సి ఉంది.
ఈ విషయం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు సంబంధించిన లిస్టెడ్ ఈక్విటీ షేర్ల తాకట్టుపై ఎస్సెల్ గ్రూప్ సంస్థల కోటక్ AMC సబ్‌స్క్రైబ్ చేసిన రూ.20 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల (NCDs)కు సంబంధించినది. 2019 ఫిబ్రవరిలో కోటక్ AMC ద్వారా NCDలు ఇతర పెట్టుబడిదారులకు విక్రయించారు. ఇందుకు సంబంధించి AMCకి రూ.12.99 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది ఎస్సెల్ గ్రూప్ సంస్థ. ఒప్పందం ప్రకారం.. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI సాధారణ వార్షిక తనిఖీ పూర్తయిన తర్వాత కోటక్ గ్రూప్ కంపెనీ ఆ మొత్తాన్ని కొంటి ఇన్ఫ్రాపవర్కు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు కోటక్ AMC సాధారణ వార్షిక తనిఖీని పూర్తి చేసిన తర్వాత SEBI తన నివేదికను జారీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా కోటక్ AMC యూనిట్ హోల్డర్లకు అంతర్లీన NCDల కింద మొత్తాలను చెల్లించిన తర్వాత అడ్వాన్స్ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలి.
ఈ మొత్తాలను తిరిగి చెల్లించాలని కోరుతూ.. కొంటి ఇన్ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ జూలై 6, 2022న కోటక్ AMCకి రెండు లేఖలు రాశాయి. దానికి కోటక్ AMC జూలై 28, 2022న సెబీ తనిఖీ పూర్తి కాలేదని సమాధానం ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ ప్రకారం.. తన డబ్బును తిరిగి చెల్లించడానికి ట్రిగ్గర్ పాయింట్‌గా ఉన్న కోటక్ AMCపై సెబీ తనిఖీ పూర్తయిందని, 28 మార్చి 2023 నాటి నివేదికను తయారు చేశామని తెలిపింది. అలాగే కోటక్ AMC దాని NCDలను లిక్విడేట్ చేసి యూనిట్హోల్డర్లకు తిరిగి చెల్లించిందని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను జూలై 10న NCLT విచారణ చేపట్టనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook