ETT Limited International Contract: స్టాక్ మార్కెట్‌లో మరోసారి సరికొత్త ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. ఈసారి మార్కెట్ ఈటీటీ లిమిటెడ్ అనే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మార్కెటింగ్ కంపెనీ మీద అందరి దృష్టి పడింది. ఈ సంస్థ తాజాగా హాంకాంగ్‌కు చెందిన స్టార్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ నుంచి రూ.60 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను పొందింది. ఇది కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద అంతర్జాతీయ కాంట్రాక్ట్ కావడం విశేషం. ఈ ఒప్పందంతో ఈటీటీ లిమిటెడ్ మార్కెట్ విశ్లేషకుల దృష్టిలోకి వచ్చింది. వారు ఈ స్టాక్‌ను ఒక సాధారణ చిన్న కంపెనీగా కాకుండా.. భవిష్యత్తులో భారీ లాభాలు ఇచ్చే మల్టీబ్యాగర్ అవకాశంగా చూస్తున్నారు.
Also Read: Patanjali Yoga: సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అభ్యాసాలు ఎందుకు ప్రాధాన్యం?
రూ.14 ధర వద్ద లభించే స్టాక్ వారికి ప్రత్యేక అవకాశమా?
ఈటీటీ లిమిటెడ్ స్టాక్ ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ కోడ్: 537707)లో రూ.14 చుట్టూ ట్రేడవుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.40 కోట్లకు పరిమితమైంది. తాజా కాంట్రాక్ట్ ద్వారా సంస్థ విలువ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్యకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుక్ వాల్యూ కంటే తక్కువ ధరలో ట్రేడవడమే దీని ప్రత్యేకత. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది బలమైన వృద్ధి అవకాశంగా మారుతోంది.
Also Read: America vs China Tariff War: అమెరికాకు చైనా భారీ షాక్.. 80 శాతం టారిఫ్‌లు పెంచిన డ్రాగన్ దేశం
గ్లోబల్ అనుభవం, భవిష్యత్ అవకాశాలకు గేట్‌వే
ఈటీటీ లిమిటెడ్ గతంలో పలు దేశీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులపై విజయవంతంగా పని చేసింది. తాజా ఒప్పందం ద్వారా కంపెనీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా బ్రాండ్ క్రెడిబిలిటీ, గ్లోబల్ నెట్‌వర్క్, మరిన్ని కాంట్రాక్టుల కోసం అవకాశాలకు దారి చూపిస్తోంది.
భారీ లాభాల వృద్ధి & జీరో డెబ్ట్ బిజినెస్ మోడల్
ఆర్థిక సంవత్సరం 2023–24లో సంస్థ లాభం గత ఆర్థిక సంవత్సరం (2022–23)తో పోలిస్తే 375 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025 మొదటి త్రైమాసికంలో లాభాలు 650 శాతం పెరిగాయి. ఇది ఒక చిన్న కంపెనీకి అసాధారణమైన వృద్ధి. కంపెనీకి ఎటువంటి ఋణాలు లేవు. ఇది పూర్తి స్థాయి “Zero Debt” కంపెనీ. ఆర్‌ఓఈ 6, ఈపీఎస్ సుమారు రూ.1 గా ఉంది.
ప్రమోటర్, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం
ఈటీటీ లిమిటెడ్‌లో ప్రమోటర్లు 65 శాతం వాటాను కలిగి ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) సుమారు 10 శాతం వాటా కలిగి ఉన్నారు. పీఈ రేషియో 17గా ఉంది. ఇది ఇండస్ట్రీ సగటైన 40 కన్నా తక్కువ. దీన్ని బట్టి స్టాక్ ఇంకా తన నిజమైన విలువకు చేరలేదని స్పష్టమవుతుంది.
టెక్నికల్ సూచికలు బులిష్ ట్రెండ్
ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ వంటి టెక్నికల్ ఇండికేటర్లు బులిష్ జోన్‌లో ఉన్నాయి. ట్రేడింగ్ వాల్యూమ్ పెరుగుతోంది. చార్ట్‌లపై బలమైన బ్రేక్‌అవుట్‌లు కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞులు ఈ స్టాక్‌ను నిశ్శబ్దంగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్‌లో చర్చ జరుగుతోంది.
అరుదైన పెట్టుబడి
భారతదేశంలో డిజిటల్ మీడియా విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అటువంటి సమయంలో లాభదాయకమైన, రుణరహిత బిజినెస్ మోడల్ కలిగిన ఈటీటీ లిమిటెడ్ వంటి కంపెనీని రూ.14 ధర వద్ద కొనగలగడం అరుదైన అవకాశం అని నిపుణులు భావిస్తున్నారు. ఇది మల్టీబ్యాగర్ స్టోరీగా మారే అవకాశాలున్న పెట్టుబడి అవకాశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









