Gold Rate: ఇది మాముల న్యూస్‌ కాదు.. బిగ్‌ బ్లాస్టింగ్‌ న్యూస్.. తులం బంగారం రూ.55,000?

Gold Rate: గత కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు బంగారం ధర రూ. 94వేలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90వేలు ఉంది. జీఎస్టీ మినహాయిస్తే అది పది గ్రాములకు రూ. 92,840గా ఉంది. ఇది ఇన్వెస్టర్లకు గొప్ప అవకాశమే అయినప్పటికీ పెళ్లికి నగలు కొనేవారికి ఇది భారీ దెబ్బ అని చెప్పవచ్చు. అయితే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం రాబోయే కొన్ని ఏళ్లలో బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల  ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు దాని నుంచి నేరుగా ప్రయోజనం పొందవచ్చు. 

Written by - Bhoomi | Last Updated : Apr 2, 2025, 05:22 PM IST
Gold Rate: ఇది మాముల న్యూస్‌ కాదు.. బిగ్‌ బ్లాస్టింగ్‌ న్యూస్.. తులం బంగారం రూ.55,000?

Gold Rate: గత కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు బంగారం ధర రూ. 94వేలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90వేలు ఉంది. జీఎస్టీ మినహాయిస్తే అది పది గ్రాములకు రూ. 92,840గా ఉంది. ఇది ఇన్వెస్టర్లకు గొప్ప అవకాశమే అయినప్పటికీ పెళ్లికి నగలు కొనేవారికి ఇది భారీ దెబ్బ అని చెప్పవచ్చు. అయితే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం రాబోయే కొన్ని ఏళ్లలో బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల  ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు దాని నుంచి నేరుగా ప్రయోజనం పొందవచ్చు. 

Add Zee News as a Preferred Source

38శాతం వరకు తగ్గడం సాధ్యమేనా అంటే అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ ప్రకారం..ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు US$1,820కి తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఔన్సుకు ధర 3,080డాలర్ల నుంచి గణనీయమైన తగ్గుతుంది. ఈ అవకాశం నిజమైతే భారత్ లో బంగారం ధరలు కూడా 10 గ్రాములకు రూ. 55, 496కి తగ్గవచ్చు. గత కొన్ని నెలలుగా ప్రపంచ అస్థిరత ద్రవ్యోల్బణం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి. దీని వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఎంతకాలం ఉంటాయనే దానిపై నిపుణులు విభేదిస్తున్నారు. 

బంగారం ఖరీదైనందున మైనింగ్ పెరుగుతుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి 9శాతం పెరిగింది. ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలు ఉత్పత్తి పెంచుతున్నాయి. పాతబంగారాన్ని పెద్దెత్తున రీసైకిల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు 2024లో 1,045టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అయితే ప్రపంచ బంగారు మండలి సర్వే ప్రకారం 71శాతం బ్యాంకర్లు వచ్చే ఏడాది బంగారం కొనుగోళ్లు తగ్గించుకునే అవకాశం ఉంది. 

Also Read: Stock Market: ట్రంప్ టారిఫ్ కు భయపడేదేలే..లాభాల్లో  స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్   450 పాయింట్లు జంప్   

2024లో బంగారు పరిశ్రమ లావాదేవీలు 32శాతంపెరిగాయి. గతంలో లావాదేవీలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత బంగారం ధరలు తగ్గాయి. అయితే వాల్ స్ట్రీట్ లోని కొన్ని పెద్ద సంస్థల ప్రకారం బంగారం ధరలు మరింత పెరగవచ్చు. రాబోయే రెండేళ్లలో బంగారం ధర ఔన్సుకు 3,500డాలర్లు చేరుకుంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. అలాగే గోల్డ్ మన్ సాచ్స్ ప్రకారం 2025 చివరి నాటికి బంగారం ధర 3,300డాలర్లకు చేరుకోవచ్చు. 

మొత్తంగా బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అంటే బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కానీ నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వినియోగదారులను, పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బంగారం ధరలు 38శాతం తగ్గుతాయా లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ అంచనాలు అమెరికా విధానాలు అంచనాల ప్రకారమే ఈ వార్తను రాయాల్సి వచ్చింది. 

Also Read:  Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News