)
PIB Fact Check: ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ మూలన..ఏం జరిగినా సోషల్ మీడియాలో ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ వార్తలు కూడా ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా కాదా అని ఆలోచించకుండా వాటిని షేర్ చేస్తుంటారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలను కూడా ఎడిట్ చేసి వాస్తవ విరుద్ధ కథనాలను యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆర్ధిక మంత్రి నిర్మలసీతారామన్ పేరుతో ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ వేలల్లో రోజువారీ ఆదాయాన్ని పొందే ఈజీ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ ను ప్రోత్సహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వం 24గంటల్లో రూ. 60వేల నుంచి నెలకు రూ. 10లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ప్రోత్సహిస్తుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్తలను ఛేదించే PIB ఫ్యాక్ట్ చెక్, వినియోగదారులు ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ AI- మానిప్యులేట్ చేసిన వీడియో అని ..ఇది పూర్తిగా ఫేక్ అని తేలిందని వెల్లడించారు. ఇలాంటి వార్తలకు సంబంధించిన వీడియో లింక్స్ పై క్లిక్ చేసే ముందు ప్రజలు పూర్తి విషయాలను తెలుసుకోవాలని PIB సూచించింది.
ఫేస్‌బుక్‌లోని ఒక వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి @nsitharaman రోజువారీ ఆదాయాన్ని సులభతరం చేసే 'పెట్టుబడి కార్యక్రమం'ను ప్రచారం చేస్తున్నట్లు ఫేక్ వార్త వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అలాంటి ఏ పథకాన్ని ప్రారంభించలేదు లేదా ఆమోదించలేదు"అని PIB ఫ్యాక్ట్ చెక్ Xలో అధికారిక పోస్ట్‌లో పేర్కొంది. ఇలాంటి గెట్ రిచ్ ట్రాప్ లో పడకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా స్కీములో ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని తెలిపింది.
? Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month!
?Sounds tempting❓ ? Think Again‼️
A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅
❌ FAKE ALERT!
?The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025
ఏఐ టెక్నాలజీ డెవలప్ మెంట్ వల్లే ఇలాంటి ఫేక్ వీడియోలు వస్తున్నాయని.. ఈ తరహా వీడియోల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఏఐ వీడియోలను గుర్తించేందుకు వీడియోలో స్పీకర్ పెదవుల కదలిక లేదంటే వారు మాట్లాడే తీరును గమనించాలని తెలిపారు. వీడియోలో తేదీ, నేపథ్యంలో లోగో కూడా సరిపోల్చుకోవాలని సూచించింది.
మీకు అలాంటి అనుమానాస్పద సందేశం ఏదైనా వస్తే, మీరు దాని ప్రామాణికతను తెలుసుకోవచ్చు. ఆ వార్త నిజమో కాదో చెక్ చేసుకోవచ్చు. దాని కోసం, మీరు https://factcheck.pib.gov.in కు మెసేజ్ పంపాలి. ప్రత్యామ్నాయంగా మీరు ఫ్యాక్ట్ చెక్ కోసం +918799711259 కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు. మీరు మీ మెసేజ్ pibfactcheck@gmail.com కు కూడా పంపవచ్చు. ఫ్యాక్ట్ చెక్ సమాచారం https://pib.gov.in లో కూడా అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook