Fact Check: ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులు కేవలం 5 రోజులు మాత్రమే పనిచేస్తాయా? 

Fact Check on 5 Days Bank Working: ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో బ్యాంకులు కేవలం ఐదు రోజులే పనిచేస్తాయనే వార్త విపరీతంగా ట్రెండ్‌ అవుతుంది. అది ఏప్రిల్‌ 1 నుంచే అమలు అవుతాయని తెలుస్తోంది. ఇందులో నిజమెంత? తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Mar 21, 2025, 07:10 PM IST
Fact Check: ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులు కేవలం 5 రోజులు మాత్రమే పనిచేస్తాయా? 

Fact Check on 5 Days Bank Working: బ్యాంకులు రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారాలు దేశవ్యాప్తంగా బంద్‌ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే, ఎన్నో రోజులుగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు బ్యాంకు ఐదు రోజుల పనికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవలి బడ్జెట్‌ తర్వాత దీనిపై ప్రకటన వస్తుంది అనుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కాకుండా మరికొన్ని డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు పెట్టాయి. ఈనేపథ్యంలో 24, 25వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు స్ట్రైక్‌ కూడా నిర్వహిస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో మొన్నటి నుంచి సోషల్‌ మీడియా, వార్తల్లో బ్యాంకులు ఏప్రిల్‌ నుంచి ఐదు రోజులు పనిచేస్తాయనే వార్త వినిపిస్తుంది. ప్రతి శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవవు. ఇది ఆర్‌బీఐ రెగ్యులేషన్‌తో ఐదు రోజులు పనిదినాలు అందుబాటులోకి రానున్నాయి అనే వార్త వినిపిస్తుంది. దీంతో బ్యాంకు ఖాతాదారుల్లో గందరగోళం మొదలైంది.

చాలా మందికి బ్యాంకు ఐదు రోజుల పనిదినాల గురించి సరైన సమాచారం లేదు. అయితే, ప్రభుత్వ ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఈ విషయమై ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐదు రోజుల పని దినాలకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్యాక్ట్‌ చెక్‌లో ఇది ఫేక్‌ అని తేలింది.

ప్రస్తుతం బ్యాంకులు కేవలం ప్రతి ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బంద్‌ ఉంటాయి. అయితే, వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ కోసం బ్యాంకింగ్‌ యూనియన్లు ఎన్నో రోజులుగా ఈ ఐదు రోజుల పనిదినాల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు ఈ ఐదు రోజుల పనిదినాలతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా పెట్టింది. దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సోమవారం నుంచి అంటే మార్చి 24, 25వ తేదీల్లో రెండు రోజులు స్ట్రైక్‌ నిర్వహిస్తున్నాయి. ఇది కాకుండా మార్చి 22 నాలుగో శనివారం, 23 ఆదివారం ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు పనిచేయవు. అంటే మొత్తంగా వరుసగా నాలుగు రోజులు దేశవ్యాప్తంగా బంద్‌ ఉండనున్నాయి. 

 

 

ఇదీ చదవండి : Paneer: పనీర్‌ ఒక సూపర్‌ఫుడ్‌.. ఇది తింటే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

మార్చి నెలలో బ్యాంకులకు 14 రోజులు పనిచేయవు. పండుగలు, ప్రత్యేక దినాలతోపాటు ప్రతి ఆదివారం, రెండు, నాలుగో శనివారం కూడ బ్యాంకులు పనిచేయవు. ఈ నేపథ్యంలో ముందుగానే బ్యాంకు ఖాతాదారులు తెలుసుకుని వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్నా కానీ, ఏటీఎం సేవలు, ఆన్‌లైన్‌ పేమెంట్స్, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. దీంతో ఖాతాదారులు చెల్లింపులు చేయవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే, చెక్‌కు సంబంధించిన సేవలు పొందాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే..

ఇదీ చదవండి : Zinc: ఈ విటమిన్ ఉండే ఫుడ్ తింటే జుట్టు ఏ షాంపూ పెట్టకున్నా పెరుగుతూనే ఉంటుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News