500 Notes: ఆ రూ. 500నోట్లతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హోంశాఖ

500 Notes: మార్కెట్లోకి కొత్త 500 రూపాయలు దొంగనోట్లు చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.   

Written by - Bhoomi | Last Updated : Apr 22, 2025, 08:36 AM IST
500 Notes: ఆ రూ. 500నోట్లతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హోంశాఖ

500 Notes: అత్యాధునిక టెక్నాలజీ వాడి తయారు చేసిన రూ. 500 దొంగనోట్లు చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. ఈ సమాచారాన్ని డీఆర్ఐ, ఎఫ్ఐయూ, సీబీఐ, ఎన్ఐఏ, సెబీతో కూడా షేర్ చేసింది. ఆ దొంగనోట్ల ప్రింటింగ్ నాణ్యత చాలా వరకు అసలు నోట్ల మాదిరిగానే ఉన్నట్లు వెల్లడించింది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది. 

Add Zee News as a Preferred Source

అయితే ఈనోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పుఉందని..దీనినిగుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది RESERVE BANK OF INDIA అనే దానిలో RESERVE పదంలో E బదులు A పడినట్లు వెల్లడించింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ నోట్లు మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించింది హోంశాఖ. మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి తెలిపారు. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

రూ. 500 నోటు తీసుకునేటప్పుడు సెక్యూరిటీ త్రెడ్ , నోటు ముద్రణ క్వాలిటీ, డిజైన్ చక్కగా ఉండటం, నోటు రంగు చేతికి అంటుకుంటుందా, వంటివి పరిశీలిస్తే నకిలీదో కాదో తెలుస్తోంది. ఇంగ్లీష్ పదాల్లో అక్షర దోషాలున్నా కూడా అది నకిలీదే అని చెప్పవచ్చు. 

దేశంలో చెలామణిలోకి వస్తున్న రూ. 500 ఫేక్ నోట్ల వ్యవహారంలో కొన్ని విదేశీ సంస్థల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ లో ముద్రించి, బంగ్లాదేశ్ ద్వారా వీటిని మన దేశంలోకి పంపిస్తున్నట్లు భావిస్తున్నారు. మనదేశానికి వ్యతిరేకంగా పనిచేసే టెర్రరిస్టు సంస్థలకు నిధులు సమకూర్చేందుకే ఇలా చేస్తున్నట్లు దర్యాప్తు వర్గాల అంచనా. పూర్తిగా ప్రభుత్వం ముద్రించే నోట్ల తరహాలోనే ఫేక్ కరెన్సీ కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. 
 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News