)
Festival Jackpot For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ.. దసరా, దీపావళి కానుకను ముందే కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్ హాక్ బోనస్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న ఉద్యోగులందరూ 30 రోజుల జీతానికి సమానమైన బోనస్‌ను అందుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బోనస్‌కు సంబంధించి అధికారిక పత్రాన్ని రిలీజ్ చేసింది. గ్రూప్ సి ఉద్యోగులందరూ ఈ బోనస్ పథకానికి అర్హులని తెలిపింది. అలాగే, గ్రూప్ బి లోని నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, ఉత్పాదకతతో సంబంధం లేని పథకాల్లో ఉన్న ఉద్యోగులు కూడా ఈ బోనస్‌ను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
అర్హత ప్రమాణాలు ఏంటంటే..
మార్చి 31, 2025 నాటికి కనీసం ఆరు నెలలు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరూ ఈ బోనస్‌ను అందుకోవడానికి అర్హులు. పూర్తి సంవత్సరం కంటే తక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు.. వారు పనిచేసిన నెలల ఆధారంగా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ చెల్లిస్తారు. ఈ విధానం ద్వారా అర్హత ఉన్న ఉద్యోగులందరికీ న్యాయమైన ప్రయోజనం చేకూరుతుంది.
ఈ ఉద్యోగులందరూ కూడా బోనస్‌కు అర్హులే..
కేంద్ర పారామిలిటరీ దళాలు మరియు సాయుధ దళాలలో అర్హత కలిగిన సిబ్బంది అందరూ ఈ ప్రత్యేక బోనస్‌ను పొందవచ్చు. ఇతర బోనస్ లేదా ప్రత్యేక చెల్లింపు పథకాల కింద జీతం పొందని కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తిస్తుంది. 2025 మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉండి, 2024-25 సంవత్సరంలో కనీసం ఆరు నెలలు పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అందుబాటులో ఉంటుంది. పూర్తి సంవత్సరం పని చేయని వారికి వారు పనిచేసిన నెలల ఆధారంగా బోనస్ చెల్లిస్తారు. విరామం లేకుండా పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ బోనస్‌కు అర్హులు. గత మూడేళ్లలో అవసరమైన రోజులు పనిచేసిన సాధారణ ఉద్యోగులకు రూ. 1,184 బోనస్‌గా నిర్ణయించారు. నెలవారీ జీతం రూ. 1,200 కంటే తక్కువ ఉన్నవారికి వాస్తవ జీతం ఆధారంగా బోనస్ లెక్కిస్తారు. బోనస్ మొత్తం సమీప సంఖ్యతో రౌండ్ ఫిగర్ చేస్తారు.
హయ్యెస్ట్ బోనస్ ఎంతంటే..
సెప్టెంబర్ 29న విడుదలైన ఉత్తర్వు ప్రకారం.. అడ్-హాక్ బోనస్‌ను లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్టంగా రూ. 7,000గా నిర్ణయించారు. ఉద్యోగి సగటు జీతం లేదా ఈ గరిష్ట పరిమితి, ఏది తక్కువైతే దాని ఆధారంగా బోనస్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఒక ఉద్యోగి నెలకు రూ. 7,000 జీతం పొందుతుంటే, 30 రోజుల బోనస్ సుమారు రూ. 6,908గా ఉంటుంది. ఒక రోజు బోనస్‌ను లెక్కించడానికి, ఉద్యోగి ఏడాదిలో సంపాదించిన సగటు జీతాన్ని ఒక నెలలో సగటు రోజుల సంఖ్య 30.4తో భాగిస్తారు. ఆ తర్వాత బోనస్ ఇచ్చే రోజుల సంఖ్యతో గుణిస్తారు.
లెక్కింపు వివరాలు ఇవే..
బోనస్‌ను లెక్కించడానికి గరిష్ట నెలవారీ జీతంగా రూ. 7,000ను పరిగణిస్తారు. ఉదాహరణగా, ఈ జీతం ఆధారంగా 30 రోజుల బోనస్‌ను ఇలా లెక్కిస్తారు. 7,000 × 30 ÷ 30.4 = రూ. 6,907.89 (రూ. 6,908కి రౌండ్ ఫిగర్).
వీరు మాత్రమే అర్హులు..
2025 మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు మాత్రమే ఈ బోనస్‌కు అర్హులు. పదవీ విరమణ చేసినవారు, రాజీనామా చేసినవారు లేదా మరణించిన ఉద్యోగులు కనీసం ఆరు నెలలు సర్వీసు పూర్తి చేసి ఉంటే వారు కూడా ఈ బోనస్ పొందవచ్చు. డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగులు తమ ప్రస్తుత సంస్థ నుంచి ఈ బోనస్‌ను అందుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook