Finotex Chemical Limited Multibagger stock: స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కెమికల్ సెక్టార్ స్టాక్ అయిన ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్.. షేరు గత ఐదు సంవత్సరాల కాలంలో తమ షేర్ హోల్డర్స్ కి భారీ లాభాలను అందించింది. అంతేకాదు వారిపై కనక వర్షం కురిపించిందని చెప్పవచ్చు. ఈ కంపెనీ షేర్లు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా 15 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది.
దీని అర్థం ఒకవేళ మీరు ఐదు సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు దాని విలువ సుమారు 16 లక్షలు గా ఉండేది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 15రూపాయలుగా ఉన్న ఈ షేర్ ధర ఇప్పుడు సుమారు రూ. 240కి చేరుకుంది.
మరోవైపు 2025 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్ నికర లాభం ఇయర్ ప్రాతిపదికన 15% తగ్గి 28 కోట్లుగా నమోదు అయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 33 కోట్లుగా నమోదు అయింది. అలాగే డిసెంబర్ రెవెన్యూ ఫ్రం ఆపరేషన్ ఇయర్ ప్రాతిపదికన 9% తగ్గి 126 కోట్లుగా నమోదు అయింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 138 కోట్లుగా ఉంది.
కంపెనీ స్టాక్ అవుట్ లోకి ఒకసారి పరిశీలించినట్లయితే చివరి ట్రేడింగ్ స్టేషన్లో ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్ షేరు ధర 4శాతం నష్టపోయి 229.58 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 438.95గాను అలాగే 52 వారాల కనిష్ట ధర 213.10 గా ఉంది.
Also Read: Myanmar: స్మశాన వాటికను తలపిస్తున్న మాయన్మార్.. 10 వేల మంది మృతి? హృదయవిదారక దృశ్యాలు
గత వారం రోజుల్లో ఈ షేర్ సుమారు 4 శాతం నష్టాన్ని అలాగే గత నెల రోజుల్లో ఈ షేరు సుమారు1 శాతం నష్టాన్ని అదేవిధంగా గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 43 శాతాన్ని నష్టాన్ని ఇక గత ఏడాది కాలంలో ఈ షేరు సుమారు 38 శాతం నష్టాన్ని అదే గత ఐదు సంవత్సరాల కాలంలో 1500% లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 2630 కోట్లుగా ఉంది.
ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్ అనేది స్పెషాలిటీ కెమికల్స్ ను తయారు చేసే ఒక ప్రముఖ భారతీయ కంపెనీ. ఈ కంపెనీ ప్రధానంగా వాటర్ ట్రీట్మెంట్ లేదా కన్స్ట్రక్షన్ తో పాటు మరికొన్ని రకాల ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకమైన కెమికల్స్ ని తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి మన దేశంతో పాటు మలేషియాలోనూ తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక ఈ కంపెనీ 1979 వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2024 చివరినాటికి ఈ కంపెనీలో మొత్తం 2005 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Also Read: School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









