FMCG Stock: లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన ఎఫ్ఎంసిజి సెక్టార్ స్టాక్ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. మార్చి 27వ తేదీన జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో 2025 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేర్ కు నాలుగు రూపాయల అభ్యంతర డివిడెంట్ కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
అలాగే ఈ మధ్యంతర డివిడెంట్ కు సంబంధించిన రికార్డును ఏప్రిల్ మూడుగా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 3వ తేదీకి ఇంకా కేవలం నాలుగు రోజులే సమయం ఉండడంతో మరో నాలుగు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు ఎక్స్ డివిడెంట్ ని క్రియేట్ చేయనున్నాయి. మరోవైపు గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్ తమ వాటాదారులకు 24 శాతం లాభాన్ని అందించింది.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం మార్చ్ 27న జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో 2025 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ డివిడెంట్ కు ఆమోదం తెలిపినట్లు అలాగే ఈ డివిడెంట్ కి సంబంధించిన రికార్డును ఏప్రిల్ మూడుగా కంపెనీ డైరెక్టర్ బోర్డును నిర్ణయించింది. ఇక ఈ మధ్యంతర డివిడెంట్ ని ఏప్రిల్ 21లోగా అర్హులైన వాటాదారులకి చెల్లించనున్నట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైల్లో వెల్లడించింది.
మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ షేరుకు బై రేటింగ్ తో పాటు టార్గెట్ ప్రైస్ ని కూడా ఇస్తున్నట్లు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన ఈక్విటీ స్టాఫ్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించారు. దీనిలో భాగంగానే ఈ కంపెనీ షేర్ కి రూ. 1570 టార్గెట్ ప్రైస్ తో పాటు రూ. 1340 అందిస్తున్నట్లు మందర్ భోజానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించారు.
Also Read: Multibagger stock: కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఐదేళ్లలో లక్షకు రూ. 15లక్షల లాభం
చివరి స్ట్రేడింగ్ సెషన్ లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ షేర్ ధర సుమారు 0.48% నష్టపోయి రూ. 1401 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర 1700 గాను అలాగే 52 వారాల కనిష్ట ద్వారా రూ.1111గా ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు ఒక శాతాన్ని లాభాన్ని అలాగే గత నెలరోజుల్లో సుమారు 10% లాభాన్ని అదేవిధంగా గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 12 శాతం నష్టాన్ని అదే గత ఏడాది కాలంలో సుమారు 24% లాభాన్ని ఐదేళ్ల కాలంలో 173% లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1,02,000 కోట్లుగా ఉంది.
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనేది దేశంలోని అతిపెద్ద ఆల్కహాల్ బేవరేజెస్ ని తయారు చేసే కంపెనీ. ఇది ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీగా పేరు పొందింది. ప్రస్తుతం 37 దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇక ఈ కంపెనీని మార్చ్ 31, 1999వ సంవత్సరంలో ప్రారంభించారు. 2024 చివరి నాటికి ఈ కంపెనీలో 2598 మంది ఉద్యోగులు చేస్తున్నారు. కాగా ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









