)
Daily Wage Workers Salary Hike: ఉత్తరప్రదేశ్‌లో అటవీ శాఖలో పని చేసే రోజువారీ వేతన ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. హైకోర్టు ఆదేశాల అనంతరం ఇకపై వారికి నెలకు కనీసం రూ. 18,000 జీతం ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో దాదాపు 3,200 మంది ఉద్యోగులు నేరుగా లాభం పొందనున్నారు.
ఇప్పటివరకు ఈ కార్మికులు రోజుకు కేవలం రూ. 252 మాత్రమే వేతనం పొందుతున్నారు. దీని వల్ల నెలకు వచ్చే మొత్తం జీవన ఖర్చులకు సరిపోక, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా వచ్చిన నిర్ణయం వారి జీవితాల్లో పెద్ద ఊరటను కలిగించనుంది. అటవీ శాఖ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సక్సేనా ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కార్మికులకు తక్షణ ప్రయోజనం చేరేలా చూడాలి అని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ హెచ్.వి. గిరీష్ ను ఈ ప్రక్రియకు నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. రాష్ట్రంలోని అన్ని అటవీ డివిజన్లలో ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సూచనలు వెళ్లాయి.
ఈ కార్మికులు ముఖ్యంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్‌లు, అడవుల సంరక్షణ, చెట్ల నాటడం, ఇతర మౌలిక పనుల్లో కీలకంగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు తక్కువ వేతనం కారణంగా వారు ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో. కానీ ఇప్పుడు స్థిరమైన జీతం రావడంతో, కుటుంబ అవసరాలను తీర్చుకునే అవకాశం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2013కు ముందే నియమించిన రోజువారీ వేతన ఉద్యోగులకు ఇది వర్తించనుంది. అంతేకాక, ప్రభుత్వ సంకల్పం వల్ల ఉద్యోగ భద్రతతో పాటు, వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోంది. ఈ కొత్త జీత నిర్మాణం వల్ల కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, పేదరికం నుంచి బయటపడటానికి ఇది ఒక బలమైన అడుగు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అటవీ శాఖ అభివృద్ధి, మరోవైపు కార్మికుల సంక్షేమం రెండూ సాధ్యమయ్యేలా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.