Madhabi Puri Buch: ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్

Madhabi Puri Buch:  ఏసీబీ న్యాయస్థానంపై ఇచ్చిన ఆదేశాలపై సెబీ మాజీ చీఫ్ మాధబి పురీ బచ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.   

Written by - Bhoomi | Last Updated : Mar 3, 2025, 02:59 PM IST
Madhabi Puri Buch: ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్

Madhabi Puri Buch: అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలపై సెబీ మాజీ చీఫ్ మాధబి పురీ బచ్..బాంబ్ హైకోర్టును ఆశ్రయించారు. బచ్ తోపాటు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామ్ రామమూర్తి, పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్, సెబీ పూర్తికాల సభ్యులు అశ్వనీ భాటియా, అనంత్ నారాయణ్, కమలేశ్ చంద్ర వర్ష్నేలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఆదేశాలను కొట్టివేయాలంటూ వారు అత్యవసర విచారణను కోరారు. దీనిపై జస్టిస్ ఎస్జీ డికే నేత్రుత్వంలోని సింగిల్ బెంచ్ మంగళవారం విచారణ జరపనుంది.

Add Zee News as a Preferred Source

అప్పటి వరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయవద్దని ఆదేశించారు. సెబీ మాజీ చీఫ్, సెబీ డైరెక్టర్లు అయిన అశ్వినీ భాటియా, అనంత్ నారాయణ జి, కమలేశ్ చంద్ర వర్ష్నే తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. బీఎస్ఈ ఎండీ, సీఈఓ సుందరరామన్ మూర్తి, మాజీ ఛైర్మన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ హాజరయ్యారు. 

స్టాక్ మార్కెట్లో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్ పర్సన్ మాధబీ పురి బచ్ తోపాటు అయిదుగురు ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై లోని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి ఏక్ నాథ్ రావు బంగర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Preity Zinta: ప్రీతిజింటాపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?  

ఆయా అంశాల్లో నియంత్రణపరమైన లోపాలు చోటుచేసుకున్నాయని, కుట్ర జరిగిందనేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నందున..పారదర్శక నిష్పాక్షిక విచారణ అవసరమని భావిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. 1994లో బీఎస్ఈలో కాల్స్ రిఫైనరీస్ లిమిటెడ్ కంపెనీ షేరు నమోదుకు అనుమతులు ఇవ్వడంలో పెద్దెత్తున ఆర్థిక మోసం, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన విలేకరి సపన్ శ్రీవాస్తవ దాఖలుచేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బంగర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. 
Also Read:  Champions Trophy 2025: వన్డే ప్రపంచకప్ 2023 ప్రతీకారం తీర్చుకోనుందా టీమ్ ఇండియా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News