UPI New Rules: బిగ్..బిగ్..అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి మీ UPI సేవలు పనిచేయకపోవచ్చు

Bank Alert: ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయని మొబైల్ నెంబర్లతో యూపీఐ సేవలు పనిచేయవు. ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 20, 2025, 08:13 PM IST
UPI New Rules: బిగ్..బిగ్..అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి మీ UPI సేవలు పనిచేయకపోవచ్చు

Bank Alert:  మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ చేస్తుంటే లేదా UPI ఉపయోగించి లావాదేవీలు చేస్తుంటే ముఖ్యగమనిక.  ఏప్రిల్ 1 నుండి, ఉపయోగంలో లేని మొబైల్ నంబర్‌లను బ్యాంక్ ఖాతాలు లేదా UPI యాప్‌ల నుండి తొలగిస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే..మీరు మీ బ్యాంక్ ఖాతాకు లేదా Google Pay, PhonePe,  Paytm వంటి UPI యాప్‌కి ఒక నంబర్‌ను లింక్ చేసి, ఆ నంబర్‌ను రీఛార్జ్ చేయకపోతే... ఆ నంబర్ పనిచేయకపోతే మీ బ్యాంక్ ఖాతా నుండి ఆ నంబర్ డిలీట్ చేస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI మార్చి 31 లోగా అటువంటి  నెంబర్లను తొలగించాలని బ్యాంకులు, యాప్‌లకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

Add Zee News as a Preferred Source

ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయని లేదా మార్చిన మొబైల్ నెంబర్లతో యూపీఐ సర్వీసులు పనిచేయడం ఆగిపోతాయి. 

కారణాలివే: 

పాత,క్రియారహిత నెంబర్లను తొలగించడం, బ్యాంక్ అకౌంట్ కు లింక్ లేని నెంబర్లను బ్లాక్ చేయడం, సైబర్ మోసాలను అరికట్టేందుకు ఎన్సిపిఐ కొత్త భద్రతా చర్యలు, కేవైసీ అప్ డేట్ చేయని యూజర్లకు లిమిట్స్, 

Also Read: TDS Rules: సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్.. డబ్బులు ఆదా చేసుకునే ఛాన్స్  

మీ మొబైల్ నెంబర్ ఇలా అప్ డేట్ చేయండి: 

మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ను చెక్ చేయండి, నెంబర్ మారినట్లయితే, బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త నెంబర్ అప్ డేట్ చేయండి. గూగూల్ పే, ఫోన్ పే, పేటీఎం సెట్టింగ్స్ లో మేనేజ్ అకౌంట్ విభాగంలో కొత్త నెంబర్ రిజిస్టర్ చేయండి. ఎన్సిపిఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా కొత్త మార్గదర్శకాలను చదివి అవసరమైన కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. 

ఏప్రిల్ 1 తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ కానీ మొబైల్ నెంబర్ ఉంటే యూపీఐ లావాదేవీలు నిలిచిపోతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ను ఉపయోగించలేరు. మీ అకౌంట్స్ తాత్కాలికంగా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూపీఐ చెల్లింపులు సురక్షితంగా కొనసాగించేందుకు ఎన్సిపిఐ ఈ మార్పులను తీసుకువచ్చింది. మీ బ్యాంక్, యూపీఐ యాప్ లో మొబైల్ నెంబర్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి. అలా చేస్తే ఏవైనా సమస్యలు లేకుండా మీ ట్రాన్సక్ష్స్ నిరంతరాయంగా  కొనసాగుతాయి. 

Also Read: Swiggy Shares: దెబ్బకు పడిపోయిన స్విగ్గీ స్టాక్స్.. వేల కోట్లు హాంఫట్‌.. పెట్టుబడి పెట్టవచ్చా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News