Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు అనేది సర్వసాధారణం అయ్యింది. ఏ చిన్న అవసరం వచ్చినా పేమెంట్ చేసేందుకు క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అయితే కస్టమర్లు వీటికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తీసుకునే నిర్ణయాలు యూజర్లపై ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లు, ఛార్జీలు, పేమెంట్ సైకిల్, పెనాల్టీలకు సంబంధించి వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా తెలుసుకోవాలి. అయితే ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ , ఎస్బిఐ ఆఫర్ చేసిన క్రెడిట్ కార్డ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి మారబోతున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.
ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, విస్తారా ఎయిర్ లైన్స్ కలిగి గతంలో క్లబ్ విస్తారా ఐడీఎఫ్ సీ ఫస్ట్ క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి. ముఖ్యంగా మైల్ స్టోన్ ప్రయోజనాలు, మహారాజా పాయింట్లు వస్తుండేవి.
క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ అందుబాటులో ఉండటంతో ఒక ప్రీమియం ఎకానమీ టికెట్, ఒక వన్ క్లాస్ అప్ గ్రేడ్ కాంప్లిమెంటరీ ఓచర్లు వచ్చేవి. అదనంగా ప్రీమియం ఎకానమీ టికెట్లను మైల్ స్టోన్ ఓచర్స్ ఇష్యూ అయ్యేవి. వీటితోపాటు మహారాజా పాయింట్ల పేరు మీద కస్టమర్లు కొన్ని ప్రయోజనాలు అందేవి. అయితే 2025 ఏప్రిల్ 1నుంచి ఈ రివార్డు పాయింట్లు, ప్రయోజనాల విషయంలో కోత పడుతుంది.
Also Read: Supreme Court: గడువు ముగిసేవరకు ఆగుతారా, ఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
SBI కార్డ్ తన క్లబ్ విస్తారా SBI క్రెడిట్ కార్డ్, క్లబ్ విస్తారా SBI PRIME క్రెడిట్ కార్డ్‌లలో కూడా కొన్ని మార్పులను ప్రకటించింది. ఏప్రిల్ 1, 2025 నుండి పునరుద్ధరణ ప్రయోజనాలుగా కార్డుదారులకు ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లు ఇవ్వబడవు. క్లబ్ విస్తారా SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇకపై ఎకానమీ టికెట్ వోచర్‌లను పొందలేరు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక వ్యయంపై మైలురాయి ప్రయోజనాలు నిలిచిపోతాయి. క్లబ్ విస్తారా SBI PRIME క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్‌లను పొందలేరు. ఈ కార్డుతో పునరుద్ధరణ రుసుము బేస్ కార్డుకు రూ. 1,499, PRIME కార్డుకు రూ. 2,999. అయితే, పునరుద్ధరణ రుసుములను మాఫీ చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.
ఈ మార్పుల తర్వాత, క్లబ్ విస్తారా కార్డ్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న అనేక ప్రత్యేక ప్రయోజనాలు తగ్గిస్తాయి. దీని కారణంగా వారు విమాన ప్రయాణంలో డిస్కౌంట్లు, వోచర్ల ప్రయోజనాలను పొందలేరు. అయితే, మహారాజా పాయింట్లు మార్చి 31, 2026 వరకు IDFC ఫస్ట్ కార్డ్ హోల్డర్లకు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల వారు కొన్ని ప్రయోజనాలను పొందగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









