)
Jobs: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే ఆరు నెలల్లో ఉద్యోగ మార్కెట్ మళ్లీ ఊపందుకోబోతోందని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ తాజాగా నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలోనూ ఈ సానుకూల సంకేతాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1300కిపైగా కంపెనీల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. అందులోనూ చాలా కొత్త నియామకాలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సర్వే వివరాలను చూసినట్లయితే ఉద్యోగార్థులకు కొత్త ఆశలు కలుగుతున్నాయి. ఈ సర్వేల్లో పాల్గొన్న కంపెనీల్లో 72శాతం యాజమాన్యాలు తమ సిబ్బందిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. రాబోయే నెలల్లో నియామకాలు చేపడతామని 94శాతం కంపెనీలు వెల్లడించాయి. అంటే ఉద్యోగ మార్కెట్ ఇప్పుడు వేడి పుంజుకునేందుకు సిద్ధమవుతోందని చెప్పవచ్చు. దీని వల్ల వేలాది మందికి కొత్త అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుంది. నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ..ఇంత పెద్ద సంఖ్యలో కంపెనీలు కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావించడం మార్కెట్ కు మంచి సంకేతమని చెప్పారు.
చాలా మంది ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయంతో ఉన్నారు. కానీ ఈ సర్వే మాత్రం ఆ అనుమానాలను కొట్టిపారేసింది. పాల్గొన్న యాజమాన్యాల్లో 87శాతం మంది ఏఐ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం 13శాతం మంది ఏఐ వల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారు. ముఖ్యంగా ఐటీ, డేటా అనలిటికల్స్, బిజినెస్ డెవలప్ మెంట్ వంటి రంగాల్లో ఏఐ వల్ల చాన్స్ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే ఏఏఐతో ఉద్యోగాలకు ఎలాంటి భయం లేదని..బదులుగా కొత్త అవకాశాలు వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఇక రిక్రూట్ మెంట్ విషయం చూసినట్లయితే సంప్రదాయ టెక్నాలజీల కంటే ఆధునిక టెక్ స్కిల్స్ ఉన్నవారికే ఎక్కువగా డిమాండ్ ఉందని తేలింది. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఏఐ ఆధారిత నైపుణ్యలు ఉన్నవారిని ఎక్కువగా రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ముందుంటున్నాయని. సర్వే ప్రకారం మొత్తం కంపెనీల్లో 37శాతం ఐటీ విభాగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టెక్నాలజీ మారుతున్న తరుణంలో ఈ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి భవిష్యత్తు బాగుంటుందని చెప్పవచ్చు.
అనుభవం కూడా పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు 47శాతం యాజమాన్యాలు 4-7ఏళ్ల అనుభవం ఉన్నవారికి ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నాయి. అంటే మిడిల్ లెవల్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎంట్రీ లెవల్ అభ్యర్థులకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మూడేళ్లలోపు ఎక్స్ పీరియన్స్ ఉన్నవారిని రిక్రూట్ చేసుకోవడానికి 29శాతం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అంటే కొత్తగా కెరీర్ మొదలుపెట్టే వారికి మంచి ఛాన్స్ ఉంటుంది.
ఫైనల్ గా ఉద్యోగ మార్కెట్లో మళ్లీ చైతన్యం షురూ అయ్యిందని చెప్పవచ్చు. ఆరు నెలల్లో ఉద్యోగాల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. కొత్తగా చదువు పూర్తిచేసినవారు, అనుభవం ఉన్న వారు అంతా సిద్ధం కావాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ స్కిల్స్ ను అప్ డేట్ చేసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.