Jeet Adani Diva Jaimin Shah Marriage: ఆసియాలోనే అత్యంత ధనికుడు గౌతమ్ అదానీ కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతడి కుమారుడి పెళ్లి ఆకాశమంత పందిరి.. భూలోకమంతా మండపం ఉంటుందని అనుకుంటే అలాంటిది ఏమీ లేకుండా అత్యంత నిరాడంబరంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి అతిథులు వస్తారనుకుంటే ఆత్మీయ మిత్రులు, కుటుంబసభ్యుల మధ్య చాలా తక్కువ మంది సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు.
Also Read: Ration Cards: ప్రజలకు భారీ శుభవార్త.. మీ సేవలో రేషన్ కార్డు దరఖాస్తులు
అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో శుక్రవారం జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్ అనే అదానీ టౌన్‌షిప్‌లో గుజరాత్ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక నిర్వహించారు. అతి కొద్ది మంది సమక్షంలో దివా షా మెడలో జీత్ అదానీ మూడు ముళ్లు వేశాడు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి వార్తలు, ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. నిరాడంబరంగా ఈ వివాహం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Egg Cooking Method: గుడ్డును మీరు ఉడికించేది శుద్ధ తప్పు.. ఉడికించే విధానం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
ఇక ఈ వివాహానికి సంబంధించి గౌతమ్ అదానీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'దేవుడి ఆశీర్వాదంతో జీత్, దివా పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్‌లో సంప్రాయదా ఆచారాలు, శుభ్ మంగళ్‌భావ్‌తో వారి వివాహం జరిగింది. ఇది చాలా వ్యక్తిగతంగా జరిగిన వేడుక కావడంతో నా శ్రేయోభిలాషులను ఆహ్వానించకపోయాను. దీనికి నన్ను క్షమించంది. దివా, జీత్ దంపతులకు మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కోరుతున్నా' అని గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు సంబంధించిన రెండు ఫొటోలను అదానీ పంచుకున్నారు.
కాగా అత్యంత నిరాడంబరంగా ఈ వివాహం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల కిందట ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ధనికుడు కావడంతో గౌతమ్ అదానీ అంబానీని మించి తన కుమారుడి పెళ్లి చేస్తాడనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నిరాడంబరంగా చేశారు. ఈ పెళ్లికి అయిన ఖర్చు పట్టుమని రూ.వంద కోట్లు కూడా ఖర్చు కాలేదని తెలుస్తోంది.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter








