)
IAS vs Minister Salary 2025: యూపీఎస్సీకి సిద్ధమవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. యూనియన్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఐఏఎస్ లు అవుతారు. దీని తర్వాత ఐపీఎస్ స్థానం వస్తుంది. ఈ టాప్ ర్యాంక్ హోల్డర్లను పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సీనియర్ అధికారులుగా నియమితులవుతారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అడ్మినిస్ట్రేషన్, పోలీస్ లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. అయితే మనదేశంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉండే సర్వీసులో సెలక్ట్ అయ్యాక ఎలాంటి వారికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి. జీతం ఎంత ఉంటుంది. తెలుసుకుందాం.
IAS జీతం ఎంత?
భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వశాఖలోనైనా..ఏ శాఖలోనైనా చిన్న నుంచి పెద్ద పదవి వరకు ప్రతి ఉద్యోగి పొందే జీతం పే కమిషన్ ద్వారా నిర్ణయిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాల ఆధారంగా ఏ స్థాయి అధికారి లేదా ఉద్యోగి ఎంత జీతం పొందాలో నిర్ణయించే కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది. అధికారి జీతం అతని పోస్టు, స్థాయి, సీనియార్టీని బట్టి ఉంటుంది. 8వ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం ఐపీఎస్ లేదా ఐఏఎస్ ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100. ఇది ప్రాథమిక జీతం మాత్రమే అని చెప్పవచ్చు. ఇదే కాదు వారికి ప్రతినెలా టీడీ, డీఏ, హెచ్ఆర్ఏ, మొబైల్ వంటి అనేక అలవెన్సులను కూడా పొందుతారు. మొత్తం మీద ఐపీఏస్ లేదా ఐఏఎస్ అధికారి ప్రారంభ వేతనం నెలకు రూ. 1లక్ష కంటే ఎక్కువగా ఉంటుంది. టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ వారి పోస్టింగ్ పై ఆధారపడి ఉంటుంది.
IAS అధికారి జీతం ఎలా పెరుగుతుంది?
పెరుగుతున్న సమయం, ప్రమోషన్, ర్యాంక్ పరంగా వారి జీతం కూడా పెరుగుతుంది. ఐఏఎస్ అధికారి ఉన్నతస్థాయి క్యాబినెట్ సెక్రటరీ. ఈ పదవికి వచ్చిన తర్వాత, అతను ప్రతినెలా రూ. 2.5లక్షల జీతాన్ని పొందుతాడు. సాధారణంగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి ప్రాథమిక వేతనం రూ. 56, 100 నుంచి 2,25,000 వరకు ఉంటుంది.
IAS వర్సెస్ మంత్రుల జీతం ఎంత?
IAS అధికారులను శాశ్వత ప్రభుత్వ అధికారులుగా పరిగణిస్తారు. వారు ప్రభుత్వం నుండి రెగ్యులర్ జీతం, అలవెన్సులు, పదవీ విరమణ ప్రయోజనాలను పొందుతారు. మంత్రి పదవి అనేది పూర్తిగా రాజకీయమైంది. వారి జీతం, సౌకర్యాలు ఆ పదవిపై ఆధారపడి ఉంటాయి. క్యాబినెట్ ఉత్తర్వు ప్రకారం, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రుల నెలవారీ జీతం రూ. 50,000 నుండి రూ. 65,000 కు పెంచారు. దీనితో పాటు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook