)
Lava Bold N1 5G Price Features: మేక్ ఇన్ ఇండియాకు ఊతం లభించేలా.. మన భారత దేశంలో ఇప్పుడిప్పుడే స్వదేశీ టెక్నాలజీకి చెందిన గాడ్జెట్స్ విపరీతంగా సేల్ అవుతున్నాయి. అటు అమెరికాతో పాటు ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా చిక్కుముడులు ఏర్పడడం వల్ల మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలంటూ ప్రధానమంత్రి మోదీ కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మన దేశంలో తయారవుతున్న లావా స్మార్ట్‌ఫోన్స్ కూడా భారీ తగ్గింపుతో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా ఈ Lava బోల్డ్ ఎన్1 5జీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మకానికి ఉంచారు. అయితే దీని ధర ఎంత? ఎంతమేర డిస్కౌంట్ వస్తుంది? దీని ఫీచర్స్ ఏంటనే దానిపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
స్వదేశీ టెక్నాలజీతో దేశంలోనే అతి తక్కువ ధరకు 5జీ స్మార్ట్ ఫోన్ లభించడం అరుదు. కానీ, అలాంటి ఛాలెంజెస్ను తట్టుకుంటూ లావా మొబైల్ తయారీ కంపెనీ తన వేరియంట్ ను ప్రవేశపెట్టింది. Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే దీన్ని మార్కెట్ ధర కంటే తక్కువగా కొనుగోలు చేయాలంటే ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు మోడల్స్ లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అందులో ఒకటి 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన బేస్ మోడల్. దీన్ని బహిరంగ మార్కెట్లో రూ.10,000 ధరకు విక్రయిస్తుండగా.. దీన్ని అమెజాన్ షాపింగ్ వెబ్సైట్లో కేవలం రూ. 7,499కే అమ్ముతున్నారు. అదే విధంగా ఈ మొబైల్ వేరియంట్లో మరో మోడల్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో రూ. 10,499కి అమ్ముతుండగా.. దీన్ని అమెజాన్‌లో కేవలం రూ. 7,999 ధరకు అమ్మకానికి ఉంచారు.
వీటిని కొనుగోలు చేసే సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లేదా EMI ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారులకు గరిష్టంగా రూ.1250 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో లావా బోల్డ్ N1 5G ధర 64GB వేరియంట్‌కు ధర రూ.6,249.. 128GB వేరియంట్‌కు రూ.6,749కు చేరుతుంది.
మరోవైపు దీన్ని కొనుగోలు చేసే సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మీ పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీరు అత్యధికంగా రూ. 7,550 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు లావా బోల్డ్ ఎన్1 5జీలో 128 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 449 రూపాయలకే ఈ ఫోన్ కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.
లావా బోల్డ్ ఎన్1 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌లో నానో డ్యూయల్ సిమ్ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 వర్షెన్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత దాదాపుగా రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్లతో పాటు మూడేళ్ల పాటు సెక్యూరిటీ ఆప్డేట్స్ పొందేందుకు అవకాశం ఉంది. లావా నోర్డ్ ఎన్1 5జీ 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లే కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది.
వీటితో మరికొన్ని ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రాసెసర్ - ఆక్టా-కోర్ యూనిసోక్ T765
స్టోరేజ్ - 4GB RAM + 64GB ROM, 4GB RAM + 128GB ROM
కెమెరా - 13MP supports for 4K/30fps Video Recording
సెల్ఫీ కెమెరా - 5 MP
ఫాస్ట్ ఛార్జింగ్ - 18W
బ్యాటరీ - 5,000 mAh
కనెక్టివిటీ - Wi-Fi, బ్లూటూత్ 4.2, OTG, USB టైప్-C ఛార్జర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook