Gold Mines Ghana: ఆఫ్రికా ఖండంలోని ఘనా అనే దేశం సాధారణంగా పేదరికం, రాజకీయ అస్థిరత, అల్లర్లు, అధిక ద్రవ్యోల్బణం, అంతర్గత రుణాల భారంతో జాతీయ సమస్యలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచస్థాయి బంగారం నిల్వలు ఉన్నప్పటికీ.. పాలకుల నిర్లక్ష్యం, అభివృద్ధిపై దృష్టి లేకపోవడం, రాజకీయ లాభాల కోసం తవ్వకాల నియంత్రణ లేకుండా విదేశీ సంస్థలకు అనుమతులు ఇవ్వడం వలన బంగారం వరం నిజమైన సంపదగా మారలేదు. తల్లి రత్నగర్భం… పిల్లలు దరిద్రులు అనే నానుడిని నిజం చేస్తున్నట్టుగా ఘనా పరిస్థితి ఆర్థికంగా మరింత క్షీణిస్తోంది.
ఒబువాసి, తార్క్వా వంటి బంగారు గనులు ఘనాకు ప్రధాన ఆదాయ వనరులుగా నిలుస్తున్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరపడలేకపోతోంది. గోల్డ్ ఫీల్డ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఘనా గోల్డ్ మైన్స్ సంవత్సరానికి సుమారు 9 లక్షల ఔన్సుల బంగారం ఉత్పత్తి చేయడం గమనార్హం. ఆఫ్రికా ఖండంలో అత్యధిక బంగారం ఉత్పత్తి చేసే దేశంగా, అలాగే ప్రపంచ బంగారం ఉత్పత్తిలో ఆరవ స్థానంగా ఘనా తన స్థానం నిలుపుకుంది.
అనధికార మైనింగ్ ఘనాకు పెద్ద సమస్య:
దేశ బంగారం నిల్వలు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, వాటిని నియంత్రిత రూపంలో తవ్వి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు చేరవేయడంలో ఘనా పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. చట్టబద్ధంగా నడిచే గనుల పక్కన వేల సంఖ్యలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నడుస్తుండటం వల్ల ఆ దేశం ఇంకా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతూనే ఉంది. నదుల కలుషీకరణ, పర్యావరణ నాశనం, యువత నేరచర్యల్లో ఇరుక్కోవడం, ప్రభుత్వం ఆదాయానికి నష్టం.. వంటివి పెరిగాయి. గతంలో అక్రమ గని కార్మికులు కనుగొన్న ఘనా చరిత్రలోనే అత్యంత పెద్ద బంగారు నగెట్ కూడా ఆ దేశంలో ఉన్న ఖనిజ సంపద పరిమాణాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
అమెరికాలో అతిపెద్ద బంగారు గని:
ప్రపంచంలో అత్యంత భారీ బంగారు గని అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. బారిక్ గోల్డ్, న్యూమాంట్ కార్పొరేషన్ సంయుక్త నిర్వహణలో నడుస్తున్న ఈ గని ప్రతి సంవత్సరం 100 టన్నులకుపైగా బంగారం ఉత్పత్తి చేస్తోంది. ఘనా వంటి ఆఫ్రికా దేశాల్లో నిల్వలు సమాన స్థాయిలో ఉన్నప్పటికీ, ఆధునిక మైనింగ్ సాంకేతికతలో వెనుకబడటం వలన ఆ సంపదను పూర్తిగా వెలికితీయడంలో ఘనా అసమర్ధంగా ఉంది.
Ghana 🇬🇭
Last year, illegal gold miners in Ghana discovered the largest gold nugget in the history of Ghana.
Africa has everything it needs, but corrupt politicians will be lining up for donations in America, Australia, Asia, and Europe! pic.twitter.com/DknqtEgWWW
— Africa Today Media Group (@africatodayMG) December 2, 2025
ఈ దేశాల్లో అతిపెద్ద బంగారు గనులు:
ప్రపంచంలో బంగారం ఉత్పత్తి పరంగా చైనా 400 టన్నుల వార్షిక ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. రష్యా 340 టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 285 టన్నులతో మూడో స్థానాన్ని సంపాదించింది. కెనడా 210 టన్నులు ఉత్పత్తి చేసి నాల్గో స్థానంలో ఉంది. అమెరికా 160 టన్నుల ఉత్పత్తితో ఐదో స్థానంలో ఉంది. ఘనా 150 టన్నుల ఉత్పత్తితో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. మెక్సికో 141 టన్నులు ఉత్పత్తి చేసి ఏడో స్థానంలో ఉంది. ఇండోనేషియా 150 టన్నుల ఉత్పత్తితో ఎనిమిది స్థానంలో ఉంది. పెరూ 137 టన్నులతో తొమ్మిదో స్థానంలో ఉంది.ఉజ్బెకిస్తాన్ 132 టన్నుల వార్షిక ఉత్పత్తితో పదో స్థానంలో ఉంది.
ఘనా ఆఫ్రికాలో చిన్న దేశం అయినా.. బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలో ఆరో స్థానాన్ని సంపాదించడం గోల్డ్ నిల్వలశక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది.
Ghana 🇬🇭
Last year, illegal gold miners in Ghana discovered the largest gold nugget in the history of Ghana.
Africa has everything it needs, but corrupt politicians will be lining up for donations in America, Australia, Asia, and Europe! pic.twitter.com/DknqtEgWWW
— Africa Today Media Group (@africatodayMG) December 2, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









