)
Gold Investment Plans: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దాదాపు రూ.2 లక్షలకు చేరువగా వెళ్లాయి. ఈ క్రమంలో దీపావళి పండుగ నుంచి అనూహ్యంగా ధరలు తగ్గిపోతున్నాయి. ఊహించని స్థాయిలో బంగారం, వెండి ధరలు తగ్గడంపై అందరి దృష్టి పడింది. రూ.లక్ష 30 వేలకు చేరువగా వచ్చిన బంగారం ఇప్పుడు దాదాపు రూ.11 వేల మేర ధరలు తగ్గాయి. మరి ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా..? లేదంటే ఉన్న బంగారాన్ని విక్రయిస్తే లాభం పొందవచ్చా? అని బంగారు మదుపరులు ఆలోచిస్తున్నారు.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) సమాచారం ప్రకారం అక్టోబర్ 28వ తేదీన బంగారం ధర రూ.1,18,043 (24-క్యారెట్లు), రూ.1,08,127 (22-క్యారెట్లు)గా ఉంది.
ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో తగ్గాయి. దాదాపు 10 శాతం మేర బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ వారం అమెరికా ఫెడ్ పాలసీ సమావేశం జరగనున్న కారణం చేత వ్యాపారుల ఆలోచన సరళి మారడంతో ఈ ధరల పతనం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు తగ్గకముందు రెండు వారాలలోపే రికార్డు స్థాయిలో పెరిగిన విషం తెలిసిందే. అక్టోబర్ 18న ధంతేరాస్ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,30,000కు చేరుకుంది. ఇక ఆ తర్వాత ధరల్లో క్షీణత ప్రారంభమైంది.
సరైన అంచనాలు ఉండాలి
బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంపై మార్కెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లాభాల కోసం భారీగా బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వారంతా బంగారంపై పెట్టుబడిని ఆపివేయడంతో ధరల క్షీణత మొదలైందని వివరిస్తున్నారు. పండుగ సీజన్ కూడా ముగియడంతో ఇక ధరలు భారీగా పెరగడం అనేది ఉండదని అభిప్రాయ పడుతున్నారు.
"అంతర్జాతీయంగా బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో 10 శాతం తగ్గాయి. ప్రీమియంలతో ట్రేడింగ్ ప్రారంభించిన చాలా ఈటీఎఫ్‌లు తిరిగి సరసమైన విలువకు లేదా డిస్కౌంట్లకు చేరుకున్నాయి. ధరల్లో ఒడిదుడుకులు ఉన్న సమయంలో సరైన అంచనా వేసుకోవాల్సి ఉంది' అని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ సంఘం తెలిపింది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కన్నా గతంతో కొన్న బంగారాన్ని లాభాలకు విక్రయించుకోవచ్చని చెబుతోంది. దీనికితోడు ధరల పతనం అనేది కొన్ని రోజులు కొనసాగి తర్వాత పెరిగే అవకాశం లేకపోలేదు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు బంగారంపై పెట్టవచ్చని కూడా చెబుతున్నారు. అయితే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు చాలా రకాలుగా ఆలోచించి చేయాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే కల్పించినది. బంగారం, వెండిపై బాగా ఆలోచించి లావాదేవీలు చేయాల్సి ఉంది. ఒకటికి రెండు, మూడు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి