Gold Loans: గోల్డ్ లోన్స్ కు ముక్కుతాడు..రూల్స్ మరింత కఠినం చేయనున్న రిజర్వ్ బ్యాంక్

Gold Loans: గోల్డ్ లోన్స్ కు కళ్లెం వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడీ అవుతోంది. ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటున్న గోల్డ్ లోన్లకు చెక్ పెట్టేందుకు త్వరలోనే కఠిన నిబంధనలను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు జారీ చేస్తున్న గోల్డ్ లోన్స్ పై నిఘా పెట్టాలని సూచించింది. 

Written by - Bhoomi | Last Updated : Mar 8, 2025, 04:20 PM IST
Gold Loans: గోల్డ్ లోన్స్ కు ముక్కుతాడు..రూల్స్ మరింత కఠినం చేయనున్న రిజర్వ్ బ్యాంక్

Gold Loans: గోల్డ్ లోన్స్ తీసుకోవడం రానున్న రోజుల్లో అంత ఈజీ కాకపోవచ్చు. శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్న ఈ విభాగంలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడం,ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ పై రూల్స్ మరింత కఠినతరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

Add Zee News as a Preferred Source

బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే లోన్స్ ఈ మధ్య కాలంలో అసాధారణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుంచి గోల్డ్ లోన్స్ 50శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక పద్దతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు లోన్ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనాన్ని పేర్కొంది. 

గత 12 నుంచి 16నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆడిట్స్ లో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో రుణగ్రహీతలు క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల్లో లోపాలు కనిపించాయి. రుణ గ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన ఘటనలు కూడా వాల్యుయేషన్ పద్ధతిలో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణ గ్రహీతలకు చెప్పకుండా పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసినట్లు తేలింది. ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు. 

Also Read: Travel Tips: అమెరికాకు శత్రువు అయిన ఈ దేశంలో..భారతదేశపు ఒక రూపాయి 500 రెట్లు  

ఈ సమస్యలను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని రుణదాలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది సెంట్రల్ బ్యాంక్. 

Also Read: Patanjali Foods: పతంజలి దూకుడు.. నాగ్‎పూర్‎లో హెర్బల్ పార్క్ , మెగా ఫుడ్ స్టార్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News