)
Gold Rate: దేశంలో బంగారానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. బంగారం అంటే మహిళలు ఆభరణాల వలే కాకుండా ఆస్తిగా భావిస్తుంటారు. అందుకే ప్రతిఏడాది బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరుగుతుంటాయి. అయితే గత కొన్నేళ్లఉగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పన్నులు, మేకింగ్ ఛార్జీలు ఇవ్వన్నీ కలిపితే తులం బంగారం కొనాలంటే సుమారు లక్షన్నర రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ పెరుగుదల ఇక్కడితో ఆగదని చెబుతున్నారు. 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,000 దాకా చేరే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఒక తులం బంగారం కొనాలంటే అన్ని ఖర్చులు కలిపి రూ. 2 లక్షల వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఈ ఏడాదిలోనే కొని పెట్టుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి ఎక్కువగా ఉంది. అమెరికా సుంకాలు, వడ్డీ రేట్లలో మార్పులు, కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు.. ఇవన్నీ బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అదనంగా, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరను మరింత పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. బంగారం ధరల గత చరిత్రను పరిశీలిస్తే, ఇది ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. 2007లో తులం బంగారం కేవలం రూ. 8,000 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అదే తులం ధర లక్షన్నర దాటిపోయింది. మరో రెండేళ్లలో అంటే 2026–2027 నాటికి ఇది రెండు లక్షలకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 99,000 నుండి రూ. 1,10,000 వరకు ఉంది. బంగారం క్యారెట్ క్వాలిటీ (22K, 24K) ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. ICICI బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలోనే బంగారం ధర రూ. 1.10 లక్షల నుండి రూ. 1.25 లక్షల వరకు పెరగనుంది. అందువల్ల, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై మూడు నెలల సమయం కీలకం. ఇప్పుడే కొంత కొని దాచుకుంటే భవిష్యత్తులో అధిక ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆభరణాల కోసం అయినా, పెట్టుబడి కోసం అయినా, ఈ ఏడాదే బంగారం కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.