Gold Rate: తులం బంగారం ధర ఏకంగా రూ.70,000కు పడిపోయే ఛాన్స్.. నమ్మబుద్ధి కావడం లేదా.. కారణాలు ఇవే

Gold Rate: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పెరిగి ఉన్నాయి అయితే ఇక్కడి నుంచి బంగారం ధర భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వెలువడుతోంది. బంగారం ధరలు తగ్గడానికి దారి తీసే కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Apr 29, 2025, 07:11 PM IST
Gold Rate: తులం బంగారం ధర ఏకంగా రూ.70,000కు పడిపోయే ఛాన్స్.. నమ్మబుద్ధి కావడం లేదా.. కారణాలు ఇవే

Gold Rate: బంగారం ధర అక్షయ తృతీయ సందర్భంగా ఒక లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది.  బంగారం ధరలు గత నెల రోజుల సమయంలో రికార్డు స్థాయిని నమోదు చేశాయి.  పసిడి ధరలు హద్దు అదుపు లేకుండా  దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనే ఆందోళన చాలామందిలో కలుగుతుంది.  ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. 

Add Zee News as a Preferred Source

అయితే బంగారం భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేల రూపాయలకు పతనం అయిపోతుందని  కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.  ఈ మేరకు  కజకిస్థాన్‌కు చెందిన ప్రముఖ బంగారం మైనింగ్ కంపెనీ సాలిడ్‌కోర్ రిసోర్సెస్ PLC  సీఈఓ ప్రకారం, వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. 

ముఖ్యంగా  ప్రస్తుతం బంగారం ధర దాదాపు ఒక లక్ష రూపాయల సమీపంలో ఉంది.  ఇక్కడి నుంచి బంగారం ధర 70 వేల రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.  దీని ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కలో చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ (31.2 గ్రాములు) ధర 3300 డాలర్ల వద్ద ఉంది. ఆ స్థాయి నుంచి బంగారం ధర 2500 డాలర్లకు పడిపోతుందని  అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇద్దరు  భవిష్యత్తులో సామరస్య పూర్వకంగా చర్చలు సాగించే అవకాశం ఉందని సాలిడ్‌కోర్ రిసోర్సెస్ PLC  సీఈఓ  అంచనా వేస్తున్నారు.  

Also Read:  Gold Rate Today: అక్షయ తృతీయ ఒకరోజు ముందు భారీగా తగ్గిన బంగారం ధర... ఏప్రిల్ 29 మంగళవారం పసిడి ధరలు ఇవే  

దీనికి తోడు చైనా ప్రస్తుతం అమెరికా  దిగుమతులపై విధించిన 125% డ్యూటీ  తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు ఆయన అంచనా వేస్తున్నారు.  అలాగే అమెరికన్ డాలర్ భవిష్యత్తులో బలపడుతుందని,  డాలర్ ఆధిపత్యం కోసమైనా డోనాల్డ్ ట్రంప్ చైనా తో రాజీ పడే అవకాశాలు ఉన్నాయని  ఆయన అంచనా వేస్తున్నారు.  బంగారం ఎప్పటికీ ఒక సేఫ్ పెట్టుబడి గా ఎక్కువ కాలం ఉండలేదని అందులో హెచ్చుతగ్గులు ఉంటాయని ఇతర ఆర్థిక వ్యవస్థలు స్థిరపడ్డప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని ఆయన అంచనా వేస్తున్నారు. 

Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే  

గడచిన పది సంవత్సరాలలో బంగారం రిటర్న్స్ చూసినట్లయితే  2015లో రూ. 30,000  వద్ద ఉన్న బంగారం ధర 2025లో రూ. 100,000కు  చేరుకుందని గుర్తు చేశారు. 2020లో కరోనా సమయంలో  బంగారం 47% రిటర్న్  రిటర్న్ అందించని గుర్తు చేశారు. 2024 నుండి 2025 వరకు  బంగారం 30% పెరిగింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News