Gold Price Today: గత కొన్ని రోజులుగా రెక్కలు పెట్టి ఎగబాకిన వెండి ధరలు చివరికి కాస్త బ్రేక్ వేసుకున్నాయి. అయితే బంగారం మాత్రం నెమ్మదిగా తన పెరుగుదల కొనసాగిస్తోంది. గుడ్‌రిటర్న్స్ అందించిన తాజా బులియన్ రేట్ల ప్రకారం, డిసెంబర్ 6 ఉదయం 6.30 గంటలకు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ. 280 పెరిగి రూ. 1,29,940 వద్ద నిలిచింది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,19,110గా నమోదైంది.
ఇక వెండి విషయానికి వస్తే.. కొన్ని వారాలుగా భారీ ర్యాలీ నడిపిన తరువాత ఒక్కసారిగా ధరలు గణనీయంగా కిందికి వచ్చాయి. నిన్నతో పోలిస్తే కిలో వెండి రూ. 4,000 మేర పడిపోగా, తాజా మార్కెట్ రేటు రూ. 1,86,900 వద్దకు చేరింది. ఇటీవల వెండి ధరలు అత్యధిక స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్ చేసినట్టు ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ విలువ స్వల్పంగా బలపడటం, సరఫరా సౌకర్యం పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత రాకపోవడం కూడా వెండి ధరలపై ఒత్తిడిని చూపుతున్న కీలక అంశాలే.
ఇకపోతే ఈ ఏడాదంతా చూస్తే బంగారంకన్నా వెండి పెట్టుబడిదారులకు ఎక్కువ రాబడి ఇవ్వడం విశేషం. మార్కెట్ విశ్లేషణ ప్రకారం, బంగారం సుమారు 60శాతం మేర లాభం అందించగా, వెండి మాత్రం దాదాపు 100శాతం వరకు ప్రారంభ పెట్టుబడులపై రాబడి సాధించి ఇన్వెస్టర్లకు గట్టిగానే లాభాలు చిందించింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూపాయి 1,30,900గా, 22 క్యారెట్ బంగారం రూపాయి 1,19,990గా ఉంది. అక్కడే కిలో వెండి ధర రూపాయి 1,95,900గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూపాయి 1,29,940, 22 క్యారెట్ బంగారం రూపాయి 1,19,110 కాగా, కిలో వెండి ధర రూపాయి 1,86,900గా ఉంది.
న్యూఢిల్లీలో కూడా వెండి ధర అదే విధంగా రూపాయి 1,86,900 వద్ద ఉండగా, 24 క్యారెట్ బంగారం రూపాయి 1,30,090, 22 క్యారెట్ రూపాయి 1,19,260గా నమోదైాయి. కోల్‌కతా, బెంగళూరులో 24 క్యారెట్ బంగారం ధర రూపాయి 1,29,940, 22 క్యారెట్ బంగారం రూపాయి 1,19,110గా కొనసాగుతుండగా, అక్కడ కిలో వెండి ధర రూపాయి 1,86,900గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూపాయి 1,29,940గా, 22 క్యారెట్ బంగారం రూపాయి 1,19,110గా ఉండగా, కిలో వెండి మాత్రం కొద్దిగా ఎక్కువగా రూపాయి 1,95,900కు చేరింది. పుణెలో బంగారం ధరలు ముంబై రేట్లతో సమానంగానే ఉండగా, కిలో వెండి ధర రూపాయి 1,86,900గా ఉంది.
వడోదరా, అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూపాయి 1,29,990, 22 క్యారెట్ బంగారం రూపాయి 1,19,160గా ఉండగా, కిలో వెండి ధర రూపాయి 1,86,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు ఎక్కువ మార్పులు లేకుండా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని నగరాల్లో వెండి ధరలు స్వల్పంగా కొసాగుతున్నాయి.
Also Read: Gold Mines: ఆ దేశంలో బంగారం గనుల విలవకు లేక్కే లేదు.. అయినా ఆకలి చావులు, కడు పేదరికం.. ఎందుకిలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









