
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు 21వ తేదీ గురువారం పసిడి ధరలను చూస్తే 24క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,290 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 90,567 పలికింది. కిలో వెండి ధర రూ. 1,15,035 పలుకుతోంది. బంగారం ధరలు బుధవారంతో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా తగ్గినట్లు మనం గమనించవచ్చు. అయినా కూడా బంగారం ధర నేటికి ఆల్ టైం రికారర్డ్ తో దాదాపు సమానంలో పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది ఇబ్బందికర పరిస్థితులే అని చెప్పవచ్చు.
బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువకు, బంగారానికి ప్రత్యక్ష సంబంధం ఉండటమే. దీనికి తోడు బంగారం విలువ భారీగా పెరగడానికి మరో ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లో నెగెటివ్ ఉండటము కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 70 నుంచి 80వేల రూపాయల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది ఏకంగా లక్ష రూపాయలు దాటి ముందుకు దూసుకెళ్తోంది. ఇతర లోహాలతో పోల్చి చూసినప్పటికీ బంగారం ధర చాలా వేగంగా పెరిగిందని చెప్పవచ్చు.
ఇదెలా ఉండగా బంగారం ధరతోపాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. వెండి ఇప్పటికే ఆల్ టైం రికార్డును ఒక్కసారిగా దాటి ప్రస్తుతం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 1.28లక్షల వద్ద ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఇక మరోవైపు వెండి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ పరంగా డిమాండ్ పెరగడమే అని చెప్పవచ్చు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి