Gold Rate: రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు.. ఎగబాకుతూనే ఉన్న పసిడి..

Gold Rate: బంగారం ధరలు సామాన్యులకు అంతనంత ఎత్తులో రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. సగటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న బంగారం ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. అంతేకాదు త్వరలో తులం బంగారం (10 గ్రాములు) లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 18, 2025, 07:55 AM IST
Gold Rate: రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు.. ఎగబాకుతూనే ఉన్న పసిడి..

Gold Rate: పసిడి అందనంత ఎత్తుకు రోజు రోజుకు ఎగబాకుతూనే ఉంది. మధ్యలో కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగబాకింది. ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు పుత్తడి లక్ష దిశగా పరుగులు పెడుతోంది.  పాత రికార్డులను బద్దలు గొడుతూ జెట్‌ స్పీడ్‌గా దూసుకుపోతోంది. నిన్నటి పోలిస్తే పది గ్రామాల బంగారం ధర  710 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98 వేల 380కు చేరుకుంది.

Add Zee News as a Preferred Source

22 క్యారెట్ల ఆర్నమెంట్ 10 గ్రాముల బంగారం ధర 91 వేల 110కు చేరుకుంది. దీంతో బెంబేలెత్తిపోతున్నారు కొనుగోలు దారులు. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతుండటంతో బంగారం కొనేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగువ, మధ్యతరగతి జనం. అటు వెండి ధర సైతం తగ్గేదే లేదంటూ బంగారంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండిధర 98 వేల 200 గా ఉంది.

ప్రస్తుతం బంగారాన్ని పెళ్లిళ్లు శుభకార్యాలకు ఎక్కువ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మంది ఎంత రేటున్నా.. బంగారం కొనడానికి వెనకాడరు. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా వివిధ దేశాలపై సుంకాల విధింపు వంటివి కూడా బంగారం రేటు పెరుగుదలకు కారణమంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో 5 శాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడుతు పెడుతుంటారు. కానీ అమెరికా లాంటి దేశంలో దాదాపు 75 శాతం నుంచి 80 శాతం ప్రజలు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీంతో అక్కడ ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్స్ కుదేలవుతున్నాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ వార్ సందర్బంగా ముడి చమురు ధర భారీ తగ్గాయి. దీంతో అక్కడి ప్రజలు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూ ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణమంటున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News