Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 24వ తేదీ బంగారం ధర ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98150 నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90550 నమోదయింది. ఒక కేజీ వెండి ధర రూ. 100741 నమోదయింది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెర లేపిన వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
కానీ గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు మార్కెట్ల పైన నమ్మకం పెరిగింది. ఫలితంగా తమ పెట్టుబడులను బంగారం నుంచి మళ్లీ స్టాక్ మార్కెట్ వైపు తరలించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి అని చెప్పవచ్చు. బంగారం ధర భారీగా తగ్గడానికి మరో ప్రధాన కారణం డాలర్ ధర పొందుకోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ బలం పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు.
బంగారం ధరలు తగ్గడం వల్ల పసిడి ప్రియులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ పండుగ రానుంది. ఈ పర్వదినాన భారతీయులు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఈ పవిత్ర పర్వదినం రోజు నగల దుకాణాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం భారీగా ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు బంగారం అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరంతో పోల్చి చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయానికి బంగారం ధర దాదాపు 70 వేల రూపాయల సమీపంలో ఉంది. ఈ ఏడాది దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా ఉన్న కారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతుందని క్రిసిల్ సంస్థ ఇటీవల ఒక అధ్యయనంలో పేర్కొంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో అక్షయ తృతీయ కు బంగారం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మే నెలలో పెళ్లిళ్ల సీజన్ పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గినట్లయితే జోరుగా సేల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









