Gold Rate Today: ఏప్రిల్ 25 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,040 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,10,800 పలికింది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ ఒక లక్ష రూపాయలు దాటిన పసిడి ధరలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు తగ్గడానికి అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం చైనా తో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్టు వార్తలు వస్తున్నాయి. దిగుమతి సుంకాలపై ట్రంప్ పలు దేశాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు గతంలో బంగారం వైపు పెద్ద ఎత్తున తరలించారు. మళ్లీ బంగారం నుంచి డబ్బులు ఉపసంహరించి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు.
దీంతో బంగారం ధర తగ్గడం గమనిస్తున్నాము. అయితే ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేక స్వల్పకాలిక రిలీఫ్ అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే ప్రస్తుతం అమెరికా మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఒక ఔన్స్ బంగారం ధర 3200 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా కూడా తగ్గడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా హిందువులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
ఈ పవిత్ర పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల కోసం ఈ సంవత్సరం గిరాకీ చాలా తగ్గుతుందని ఆభరణాల దుకాణాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ అక్షయ తృతీయ కు బంగారం ధర భారీగా పెరిగింది. గత సంవత్సరం ఇదే బంగారం ధర కేవలం 70 వేల రూపాయల సమీపంలోనే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం దాదాపు లక్ష రూపాయల సమీపానికి చేరింది. 2024 నుంచి 2025 సంవత్సరాల మధ్య కాలంలో బంగారం ధర భారీగా పెరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి రిలీఫ్ పసిడి ప్రియులకు కాస్త ఊరట లభిస్తుంది అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









