Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగింది... మళ్లీ 99000 దాటిన పసిడి, ఏప్రిల్ 27 ఆదివారం పుత్తడి ధరలు ఇవే

Gold Rate Today: ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99080 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90450 నమోదయింది. ఒక కేజీ వెండి ధర రూ.99600. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరగడం ప్రారంభించింది. 

Written by - Bhoomi | Last Updated : Apr 27, 2025, 08:58 AM IST
Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగింది... మళ్లీ 99000 దాటిన పసిడి, ఏప్రిల్ 27 ఆదివారం పుత్తడి ధరలు ఇవే

Gold Rate Today: ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99080 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90450 నమోదయింది. ఒక కేజీ వెండి ధర రూ.99600. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరగడం ప్రారంభించింది. 

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం మరోసారి ఒక లక్ష రూపాయల సమీపానికి బంగారం ధర చేరుకుంది. దీనికి ప్రధాన కారణం అమెరికాలో బంగారం ధర భారీగా పెరగడమే అని చెప్పవచ్చు ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3330 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. ఫలితంగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.  

బంగారం ధరలు భారీగా పెరగడానికి మరో ప్రధాన కారణం, అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు అని చెప్పవచ్చు. పసిడి ధరలు ప్రస్తుతం భారీగా పెరగడంతో  పసిడి ప్రియులు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. బంగారం ధరలు తగ్గుతాయని అంతా భావించారు.  కానీ అంతలోనే మళ్లీ పెరగడం ప్రారంభించాయి.  

దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలే అని చెప్పుకోవచ్చు. అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోవడంతో పాటు, అమెరికా ఆర్థిక మాంద్యం, డాలర్ బలహీనత వంటి కారణాల వల్ల కూడా బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభించింది. అయితే బంగారం పెరుగుదలనేది దీర్ఘకాలికంగా ఉంటుందా లేక స్వల్పకాలికమైన అనేది ఇంకా భవిష్యత్తులో తేలనుంది.  

Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే

ఎందుకంటే ఇన్వెస్టర్లకు ఇంకా మార్కెట్ పట్ల పూర్తిస్థాయిలో నమ్మకం కుదరడం లేదు. స్టాక్ మార్కెట్లలో పూర్తిస్థాయిలో పాజిటివ్ వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రమే బంగారం ధర మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉంటే బంగారం లో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఈ సంవత్సరం చక్కటి లాభాలు అందించాయని చెప్పవచ్చు. 

బంగారంలో ప్రధానంగా ఈటీఎఫ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టే వారికి  పసిడి చక్కటి లాభాలను అందించింది.  ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో అక్షయ తృతీయ పండుగ ఉంది ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని హిందువులు పెద్ద ఎత్తున భావిస్తారు కానీ పెరిగిన ధరలు చూస్తుంటే మాత్రం పసిడి కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ధరల వద్ద బంగారం కొనుగోలు చేసేందుకు కష్టమర్లు తక్కువగా ఆసక్తి చూపిస్తారని అటు దుకాణదారులు సైతం చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News