Gold Rate Today: నేడు మార్చి 27వ తేదీ గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 89, 300 పలికింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 81, 650 పలుకుతోంది. దీంతోపాటు ఒక కేజీ వెండి ధర రూ. 1,01,571 పలికింది. బంగారం ధర రికార్డు స్థాయి కంటే దాదాపు 3వేల రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతోంది. ఒక దశలో బంగారం ధర దాదాపు 92వేలు దాటింది. అక్కడినుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్చి నెలలో బంగారం ధర విపరీతంగా పెరగడంతోపాటు ఆల్ టైం రికార్డును కూడా తాకింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుుద్దం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా పతనం అవుతున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే బంగారం ఒక సేఫ్ ఇన్వెస్ట్ మెంట్. అందుకే బంగారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతుంటారు. మళ్లీ స్టాక్ మార్కెట్లో కోలుకున్నప్పుడు ఆ డబ్బును బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు.
ఈ కారణంగానే బంగారం ధర హెచ్చుతగ్గులకు గురవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు చేస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంకు ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. అయితే ఈసారి బంగారం ఎక్కువగా కొనుగోలు చేయకపోవడంతోపాటు నిలిపివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దీంతోపాటు బంగారం ఎవరైతే ఈటీఎఫ్ రూపంలో పెట్టుబడి పెట్టారో అలాంటివారు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి దగ్గర ఉంది.
Also Read: Kamindu Mendis SRH 2025: దటీజ్ కమిందు.. రెండు చేతుల్తో ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం అతనికే సాధ్యం
ఈ సమయంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మంచిదని భావించేవారు కూడా ఉంటారు. ఈ కారణంగా కూడా బంగారం ధర తగ్గే అవకాశం ఉంది. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందిగా మారవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే బంగారం ధర ఇప్పటికే రికార్డు స్థాయి దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలవారు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ బరువు ఉన్న బంగారంతోనే మంచి నగలు తయారు చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









