Gold Rate Today: హైదరాబాద్ బంగారం ధరలు భారీగానే తగ్గాయి. బంగారం ధర వారం రోజుల్లో చూస్తుంటే బాగానే దిగి వచ్చింది. బంగారం ధర గరిష్ట ధర నుంచి దిగి వస్తుంది. మార్చి 20 నుంచి చూస్తు గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. దీని వల్ల ఉగాది పండగ ముందు బంగారం కొనేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. మార్చి 20వ తేదీన బంగారం ధరలు చూస్తే రూ. 90,660 వద్ద ఉంది. 10 గ్రాముల 24క్యారెట్ల బంగారానికి ఈ ధరలు వర్తిస్తాయి. అదే సమయంలో 22క్యారెట్ల బంగారం ధరను పరిశీలిస్తే ఈ బంగారం ధర 10 గ్రాములకు రూ. 83,100 దగ్గర ఉంది. అయితే ఆ తర్వాత బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం బంగారం ధరలు అంటే నేడు మార్చి 28వ తేదీ శుక్రవారం బంగారం ధరలు రూ. 89, 850వద్ద ఉంది. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ఈ ధరలు వర్తిస్తాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 82,360 దగ్గర కొనసాగుతోంది. అంటే బంగారం ధర దాదాపు రూ. 800 వరకు పతనం అయ్యిందని చెప్పవచ్చు. బంగారంకొనుగోలు దారులకు ఇది సానుకూల అంశమే అని చెప్పవచ్చు. కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీ అదనంగా యాడ్ అవుతుంది. ఇంకా జ్యువెల్లరీ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటన్నింటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పై స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా జువెల్లర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటికూడా ఉంటాయి.
అందుకే బంగారం కొనుగోలు చేయాలని భావించే ఈ విషయాలను గమనించాలి బంగారం ఎంపిక ఆధారంగా కూడా తయారీ ఛార్జీలు మారుతుంటాయి. కొన్నింటికి ఎక్కువ ఛార్జీలు ఉంటాయి. అందుకే మీరు కొనుగోలు చేసే ముందుగానే తయారీ ఛార్జీలపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే మీకు భారీగా డబ్బులు ఖర్చు అవుతాయి.
Also Read: IPL 2025: ఇలా షికార్లు చేసి డకౌట్ అవ్వద్దు భయ్యా ప్లీజ్.. రోహిత్ ఏం చేస్తున్నాడో చూడండి
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,360, 24 క్యారెట్ల ధర రూ.89,850.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,360, 24 క్యారెట్ల ధర రూ.89,850.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,510, 24 క్యారెట్ల ధర రూ.90,000.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,360, 24 క్యారెట్ల ధర రూ.89,850.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,360, 24 క్యారెట్ల రేటు రూ.89,850.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,360, 24 క్యారెట్ల ధర రూ.89,850.
వెండి ధరలు చూస్తే:
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,900
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,10,900
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,01,900.
ముంబైలో రూ.1,01,900.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









