Gold Rate Today: బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98430 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89800 పలికింది. ఒక కేజీ వెండి ధర 99040 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిణామాలే అని కారణం గా చెప్పవచ్చు.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా తో చర్చలు జరిపేందుకు తమ సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఇది మార్కెట్లను శాంతపరిచిందని చెప్పవచ్చు. బంగారం ధరలు ఒక దశలో లక్ష రూపాయలు దాటి ముందుకు దూసుకెళ్లాయి. కానీ అక్కడ నుంచి స్వల్పంగా తగ్గడం ప్రారంభించింది దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా చెప్పవచ్చు.
స్టాక్ మార్కెట్లలో సైతం లాభాలు నమోదు అవుతున్నాయి ఈ పరిణామం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అయ్యింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించుతున్నారు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్ వైపు తరలించడం ద్వారా బంగారం ధరలు తగ్గి వస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 3500 డాలర్ల నుంచి 3300 డాలర్లకు దిగి వచ్చింది. ఈ పరిణామం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు.
Also Read: Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవే
ఇక దేశీయంగా చూసినట్లయితే రేపు అక్షయ తృతీయ, ఈ పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం అనేది భారతీయుల సెంటిమెంట్. కానీ గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ నాటికి బంగారం ధర దాదాపు 30 వేల రూపాయలు పెరిగింది. చరిత్రలో బంగారం ధర ఎప్పుడు కూడా ఎంత స్పీడ్ గా పెరగలేదు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు.
మరోవైపు ఈసారి బంగారం దుకాణదారులు సైతం తమ సేల్స్ తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు ఇంత వేగంగా ఈ స్థాయిలో ఎప్పుడు పెరగలేదని బంగారం వ్యాపారులు వాపోతున్నారు. ఓవైపు పచ్చడి ప్రియులు బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి పసిడి ధరలు భారీగా పెరిగాయని బాధపడుతుంటే, మరోవైపు ఎవరైతే బంగారంలో పెట్టుబడి పెట్టారో వారు మాత్రం సంతోషిస్తున్నారని చెప్పవచ్చు. నిజానికి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఫిజికల్ బంగారం రూపంలో కాకుండా ఈటీఎఫ్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే చక్కటి లాభాలను పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









