Gold Rate Today: నేడు మార్చి 29వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు కొనలేనంత స్థాయికి చేరుకున్నాయి. సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఏకంగా 92వేలకు తులం బంగారం ధర చేరుకుంది. లక్షరూపాయలకు తులం దిశగా దూసుకెళ్తుంది. తాజాగా బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 92,010 చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 83,800పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,03,950కి చేరుకుంది. బంగారం ధర పాత రికార్డులను పటాపంచల్ చేస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ ధర చూసి బంగారం ప్రియులు బంగారాన్ని కొనలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి బంగారం ధర తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా బంగారం ధర ఇంతలా పెరగడం ఎవరూ ఊహించలేకపోతున్నారు.
దీనికి ప్రధానంగా కారణాలెన్నో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోటార్ వాహనాలపై 25శాతం సుంకం పెంచడంతోపాటు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బంగారంలో పెద్దెత్తున పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఈ దెబ్బతో ఒక్కసారిగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది. బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 3050 డాలర్లను దాటేసింది. దీంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచికూడా బంగారం ధర భారీగా పెరిగింది.
Also Read: 7 Seater Car: కార్ల మార్కెట్‌కు కొత్త కళ.. వచ్చేనెల మార్కెట్లోకి 7 సీట్ల SUV.. ధర, ఫీచర్లు లీక్
కానీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. అయినాకూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ స్టాక్ మార్కెట్ పతనం అవ్వడం ప్రారంభించింది. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టగానే ప్రపంచ మార్కెట్లు కూడా పాజిటివ్ గా స్పందించాయి. ఎందుకంటే ఆయనను అందరూ బిజినెస్ ఫ్రెండ్లీ వ్యక్తి అనుకున్నారు. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తన, నిర్ణయాలు ఉన్నాయని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బయటపడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని ఇటీవల ఆయన చేసిన ఒక ప్రకటన వల్ల స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









