
Gold Rate Today: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం, వెండి ధరలు గత కొంతకాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగరాం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారం నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతుంటాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గత ఏడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతోంది.
ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయంతోళనలతో పెట్టుబడి దారులు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ కారణంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,149.03 డాలర్లుగా ఉంది. జూన్ డెలివరీ గడువుతో కూడిన కామెక్స్ గోల్డ్ ప్యూచర్స్ కాంట్రాక్టు 3,177 డాలర్ల దగ్గర ఆల్ టైం గరిష్టాలకు నమోదు చేశాయి. వెండి మాత్రం అరశాతానికి పైగా తగ్గి33.83 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది.
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి రూ. 8,511 కాగా 10 గ్రాముల ధర రూ. 85,110గా ఉంది. 24క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి రూ. 9,285 కాగా 10 గ్రాముల ధర రూ. 92,850గా ఉంది. ఏపీలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.85,110, రూ.92,850
చెన్నై- రూ.85,110, రూ.92,850
బెంగళూరు- రూ.85,110, రూ.92,850
పుణె- రూ.85,110, రూ.92,850
అహ్మదాబాద్- రూ.85,160, రూ.92,900
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe