Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు..తులం రూ. 3వేలు తగ్గింపు..జూన్ 2వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉంటున్నాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. జూన్ రెండవ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర   రూ. 96,360 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,330 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 97,710 పలుకుతోంది. 

Written by - Bhoomi | Last Updated : Jun 2, 2025, 01:13 PM IST
Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు..తులం రూ. 3వేలు తగ్గింపు..జూన్ 2వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉంటున్నాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. జూన్ రెండవ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర   రూ. 96,360 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,330 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 97,710 పలుకుతోంది. 

Add Zee News as a Preferred Source

బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్స్ స్థాయితో పోసి చూస్తే ప్రస్తుతం దాదాపు 3 వేల రూపాయలు తక్కువగా పలుకుతుందని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడటం అని చెప్పవచ్చు. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో కంపెనీలకు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఫలితంగా విపనిలోకి పెద్ద మొత్తంలో డబ్బు ప్రవహిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లకు పాజిటివ్ సంకేతం అని చెప్పవచ్చు.

 స్టాక్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నట్లయితే బంగారం ధరలు తగ్గుతాయి. దీనికి ప్రధాన కారణం బంగారం ధరలు స్టాక్ మార్కెట్లతో అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో భారీగా పతనం అవుతాయో అప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే సురక్షితంగా భావించే బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్ బలపడినట్లయితే, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెట్టే అవకాశం ఉంది. 

Also Read: Bangladesh New Currency Note: హిందూ దేవాలయాలు..బుద్ధుని టెంపుల్స్..బంగ్లాదేశ్ లో కొత్త నోట్లు వైరల్..!!

బంగారం ధరలు గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర దాదాపు 75 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు వెళ్లిన క్రమం చూసినట్లయితే, ఇన్వెస్టర్లకు పెద్ద మొత్తంలో లాభాలను అందించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే బంగారం ధరలు ఫ్యూచర్స్ మార్కెట్లో తగుముఖం పడుతున్నట్లు గమనిస్తున్నారు. 

ముఖ్యంగా జూలై నెలకు సంబంధించిన ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం 95,000 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్లు ఎంసిఎక్స్ మార్కెట్లో కనిపిస్తోంది. మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గి వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వరుసగా పలు దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Girl Gang-Raped: వీళ్లను ఏం చేస్తే మారుతారు? 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోతో బ్లాక్‌మెయిల్‌ !!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News