Gold Rate Today: బంగారం ధరలు అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ 30వ తేదీ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,980 నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,810 నమోదయింది. ఒక కేజీ వెండి ధర రూ.1,10,900 నమోదయింది. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటు డాలర్ బలపడటం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే అమెరికా అదే విధంగా చైనా రెండు దేశాలు కూడా సయోధ్య దిశగా ముందుకు వెళుతున్నాయి దీంతో బంగారం ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉందని సూచనలు అందుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లయితే వాణిజ్య యుద్ధం ఒక కొలిక్కి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు తగ్గడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లడమే అని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకు ప్రధాన కారణం ఎవరైతే ఇన్వెస్టర్లు బంగారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు వారు తమ పెట్టుబడులను మళ్ళీ స్టాక్ మార్కెట్ వైపు తరలించడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలకు స్టాక్ మార్కెట్లకు అవినాభావ సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్ పతనం అయినప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతుంది ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఎక్కువగా తరలిస్తారు.
ఈ కారణంగా బంగారం ధరలు అమాంతం పెరుగుతుంటాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ బలపడినప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారం నుంచి మళ్లీ స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తారు. దీంతో పాటు డాలర్ బలపడటం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టర్లు డాలర్ బలహీనంగా మారడంతో బంగారం వైపు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు డాలర్ బలంగా మారడంతో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై పెట్టుబడి పెడతారు ఫలితంగా వారికి . బాండ్ పై వచ్చే రాబడి ఎక్కువగా లభిస్తుంది.
ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతుంటాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా మరోవైపు ఈ రోజు అక్షయ తృతీయ కనుక బంగారం ధరలు తగ్గి రావడం అనేది కాస్త ఊరట అని చెప్పవచ్చు. కానీ గత సంవత్సరం అక్షయ తృతీయ తో పోల్చి చూస్తే బంగారం ధర ఈ సారి భారీగా పెరిగింది అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









