
Gold Rate Today: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు మార్చి 31వ తేదీ సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినా కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతుంది. బంగారం ధర నిన్న ఆల్ టైం రికార్డ్ స్థాయికి క్రియేట్ చేసింది. 92,400 వద్ద 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పలికింది. ఇది చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిని అని చెప్పుకోవచ్చు. బంగారం ధర తాజాగా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేడు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 92,190 పలికింది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 83,590 పలికింది. కిలో వెండి ధర రూ. 1,02,900 పలికింది. బంగారం ధర గడిచిన నెల రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండవ తేదీన మరికొన్నిరెసిప్రోకల్ సుంకాలను ప్రకటిస్తానని తెలిపారు.
ఈ దెబ్బతో అమెరికా స్టాక్ మార్కెట్లన్నీ కూడా భారీగా పతనం అవుతున్నాయి. ఫలితంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులన్నీ కూడా బంగారం వైపు తరలివెళ్తున్నాయి. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యే ఇరాన్ పై కూడా యుద్దం చేస్తానని ప్రకటించారు. ఇది కూడా ప్రపంచ మార్కెట్లను దెబ్బతీస్తోందని చెప్పవచ్చు. నిజానికి వరుస వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతిరోజూ ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇప్పటికే అమెరికా స్టార్ మార్కెట్లో భారీ పతనం నమోదు అయ్యింది. అది మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉంది. బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర అమెరికాలో ఒక ఔన్స్ కు 3110 డాలర్లు దాటి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. బంగారం ధర చరిత్రలో ఈ రేంజ్ లో పలకడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ట్రంప్ 25-50 శాతం సెకండరీ టారిఫ్ విధిస్తే, భారతదేశం వంటి దేశాలకు సమస్యలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 2023లో రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరాటం ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశం రష్యా నుండి చాలా తక్కువ ధరకు చమురును కొనుగోలు చేస్తోంది. మరోవైపు, పరస్పర సుంకం అమలు కారణంగా ప్రపంచంలో వాణిజ్య యుద్ధం పెరిగే ప్రమాదం ఉంది. ఇది బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అనేక బ్యాంకులు బంగారం ధరల అంచనాలను పెంచాయి.
పెట్టుబడిదారులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చాలని ఆర్థిక సలహాదారులు అంటున్నారు. పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం ఉండాలి. తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం లేని లేదా చాలా తక్కువ బంగారం ఉన్న పెట్టుబడిదారులు బంగారంలో తమ పెట్టుబడిని క్రమంగా పెంచుకోవాలి. ఇప్పుడు బంగారం కొనడం చాలా చౌకగా మారింది. ఇంట్లో కూర్చొని గోల్డ్ ఇటిఎఫ్ , మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, బంగారు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. కానీ, మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe