)
Gold Rate Today: బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న మంగళవారంతో పోలిస్తే నేడు సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం బంగారం ధర మరో 1000 పెరిగి చరిత్రలోనే తొలిసారిగా 1.08 లక్షల రూపాయల స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితి, గ్లోబల్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
సెప్టెంబర్ 4, బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,040గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,650కు చేరింది. వెండి ధర కూడా వెనుకంజ వేయకుండా కొత్త రికార్డు సృష్టించింది. ఒక కిలో వెండి ధర రూ.1,25,931గా పలికింది. గత వారం రోజులుగా చూస్తే ప్రతి రోజూ బంగారం ధరలు సరికొత్త స్థాయిని చేరుకుంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర 3,500 డాలర్లను దాటింది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి. దీంతో భారతదేశంలో కూడా పసిడి ధరలు ఎప్పుడూ లేని రీతిలో పెరిగిపోతున్నాయి. బంగారం పెరుగుదలతో పాటు ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగి సాధారణ వినియోగదారులకు భారమవుతున్నాయి. ముఖ్యంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర తొలిసారి 97 వేల రూపాయలు దాటడం గమనార్హం. ఈ పరిస్థితిలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మందికి కష్టతరంగా మారింది.
ఇక వెండి విషయానికి వస్తే, ఈ లోహానికి పారిశ్రామిక రంగంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం అధికమవుతున్నందున దీని ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతుండడంతో ధరలు మరోస్థాయికి చేరాయి.
మరోవైపు బంగారం ధరలు ఇంతగా పెరగడం పెట్టుబడిదారులకు లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs) మరియు బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు పొందుతున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నంత వరకు పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.