Gold Rate Today: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా ఆల్ టైం గరిష్టానికి రికార్డు సమీపంలోనే ఉంది. నేటి బంగారం ధరలు ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 95,660 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ. 87,690 పలికింది. ఒక కిలో వెండి ధరరూ. 1,01,900 పలుకుతోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు దాదాపు వెయ్యి రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డుకు ఇప్పటికీ కూడా సమీపంలో ఉన్నాయని.
బంగారం ధరలు గత రెండు వారాల సమయంలో దాదాపు 10వేల రూపాయలు పెరిగినట్లు గమనించవచ్చు. బంగారం ధర అత్యంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అని చెప్పవచ్చు. ప్రస్తుత అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3200 డాలర్లపైనే ఉంది. బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా మార్కెట్లో డాలర్ బలం క్షీణించడం ఒక కారణమని చెప్పవచ్చు.
ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ విలువ మరింత తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాదనంగా భావించే బంగారం వరకు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహం చాలా మందికి కలిగే అవకాశం ఉంది. అయితే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లకు ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య కొనసాగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఇప్పట్లో సమసి పోయేలా లేదు.
Also Read: Suzuki Hayabusa: యువతకు పిచ్చెక్కించే బైక్.. కొత్తకొత్తగా అదిరే ఫీచర్లతో హయబుసా..ధర ఎంతో తెలుసా?
ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం అనేది యావత్ ప్రపంచానికే పెద్ద దెబ్బ కలిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పరిణామాలను మొత్తం ప్రపంచం చాలా సునిశితంగా పరిశీలిస్తోంది. స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించడం అనేది సహజ సిద్ధ పరిణామం అని నిపుణులు అంటున్నారు. కాబట్టి బంగారం ధరలు దేశీయ మార్కెట్లో కొంతకాలం పాటు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
Also Read: Credit Card: మీ క్రెడిట్ కార్డును Google Payకి ఎలా లింక్ చేయాలి..ఇక్కడ ఇలా తెలుసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









